Devendra Fadnavis : నేను కోరుకుంటే సీఎం కానీ శివసేనకు పట్టం
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కామెంట్స్
Devendra Fadnavis : మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు.
తాను కోరుకుంటే సీఎం అయ్యేవాడినని చెప్పారు. కానీ మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే మీద గౌరవంతో శివసేన సైనికుడికి సీఎం పదవి అప్పగించడం జరిగిందని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మొదటి నుంచి ఏక్ నాథ్ షిండేను(Eknath Shinde) సీఎం చేయాలని నా ప్రతిపాదన. అదే చేశా. కానీ నేను ప్రభుత్వం నుంచి తప్పుకుంటే సర్కార్ నడవదని బీజేపీ జాతీయ నాయకత్వం నాకు చెప్పింది.
అందుకే నేను పార్టీకి చెందిన సైనికుడిని, సామాన్య కార్యకర్తను. పార్టీ సిద్దాంతాలకు, విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తినని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్.
తాను తప్పనిసరిగా సర్కార్ లో భాగస్వామ్యం కావాలని చెప్పినందుకే తాను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపాయి.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మరాఠాలో శివసేన, కాంగ్రెస్ , ఎన్సీపీ తో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాటు కొలువు తీరింది.
శివసేన సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటు ప్రకటించారు. ఆ మేరకు బీజేపీ సపోర్ట్ తో మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారీ మెజారిటీ సాధించారు కూడా.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : శివసేన సైనికులు సత్తా చాటాలి – ఠాక్రే
Had I requested, I could have become the CM.We made Shiv Sena CM for ideology…It was my proposal to make Shinde the CM..but senior party leaders insisted that govt won't run if I stayed out of it, so I accepted the Dy CM post on their command:Maharashtra Dy CM Devendra Fadnavis pic.twitter.com/0cpOzV0jS9
— ANI (@ANI) July 5, 2022