Leena Manimekalai : లీనా మ‌ణిమేక‌లై షాకింగ్ కామెంట్స్

కాళీ పోస్ట‌ర్ పై వెన‌క్కి త‌గ్గ‌ని డైరెక్ట‌ర్

Leena Manimekalai : కాళీ దేవి పోస్ట‌ర్ వివాదం దేశంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ఈ పోస్ట‌ర్ పై కామెంట్ చేసిన టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రాపై బీజేపీ భ‌గ్గుమంటోంది.

ఆమెపై బెంగాల్ లో కేసు న‌మోదైంది. ఇదిలా ఉండ‌గా తాజాగా కాళీ దేవి పోస్ట‌ర్ ను షేర్ చేసిన ద‌ర్శ‌క‌, నిర్మాత లీనా మ‌ణిమేక‌లై(Leena Manimekalai) స్పందించింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా తాను వెన‌క్కి త‌గ్గ‌బోనంటూ ప్ర‌క‌టించింది.

ఆమె ఇప్ప‌టి వ‌ర‌కే త‌న‌ను తాను ద్వలింగ సంప‌ర్కురాలిగా , నాస్తికురాలినంటూ స్ప‌ష్టం చేసింది. అంతే కాదు తాను తీసిన చిత్రంలో కాళీ దేవి త‌న శ‌రీరంలో నివిస్తుంద‌ని, న‌గ‌ర వీధుల్లో కూడా తిరుగుతుంద‌ని తెలిపింది.

నా కాళీ చిత్రం ఆమె స్వేచ్ఛా స్పూర్తికి నిద‌ర్శనం. ఆమె పితృస్వామ్యంపై ఉమ్మి వేస్తుంద‌ని పేర్కొంది. హిందూత్వ‌ను కూల్చి వేస్తుందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

పెట్టుబ‌డిదారీ విధానాన్ని నాశ‌నం చేస్తుంద‌ని , త‌న వెయ్యి చేతుల‌తో అంద‌రిని ఆలింగ‌నం చేసుకుంటుంద‌న్నారు లీనా మ‌ణిమేక‌లై. ఆమె సినిమా పోస్ట‌ర్ లో కాళీ దేవి వేషం ధ‌రించిన ఒక మ‌హిళ ధూమ‌పానం చేస్తున్న‌ట్లు తీసింది.

ఈ ఫోటోను ఇటీవ‌ల ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో హిందూత్వ వాదులు భ‌గ్గుమ‌న్నారు. డైరెక్ట‌ర్ పై నిప్పులు చెరుగుతున్నారు. కొంద‌రు మిత‌వాదులు మాత్రం లీనా మ‌ణిమేక‌లైకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.

డాక్యుమెంట‌రీ చిత్రం తీసింది. వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో ఈ చిత్రంలో కాళిని త‌న లాగే చూశాన‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఆమె పోస్ట్ చేసిన పోస్ట‌ర్ ను ట్విట్ట‌ర్ తొల‌గించింది. కానీ అది ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Also Read : దేవుళ్లు బీజేపీకి చెందిన వారు కారు

Leave A Reply

Your Email Id will not be published!