Komatireddy Raj Gopal Reddy : రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్
నిప్పులు చెరిగిన రాజగోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ పార్టీ, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
పీసీసీ పదవిని డబ్బులు పెట్టి తెచ్చుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. పక్కా స్కెచ్ చేసి టీడీపీని నామ రూపాలు లేకుండా చేశాడని మండిపడ్డారు.
బుధవారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా రేవంత్ రెడ్డిపైనే విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. పీసీసీ చీఫ్ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్ తో వచ్చాడని ధ్వజమెత్తారు.
ఎవరైనా తమ పదవికి రాజీనామా చేస్తే స్పీకర్ కు ఇస్తారని కానీ రేవంత్ రెడ్డి స్పీకర్ కా కాకుండా చంద్రబాబు కు ఇచ్చాడని ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికకు భయపడి రాజీనామా చేసినట్లు నటించాడంటూ కామెంట్ చేశారు. సోనియా గాంధీ ఇప్పటికీ తనకు దేవత అని కొనియాడారు.
ఆమె దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఆమెను బలి దేవత అన్న విషయం మరిచి పోయాడా అని ప్రశ్నించారు.
సోనియమ్మను తాను ఎప్పుడూ అవమాన పర్చలేని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy). తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా రైవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడా అని నిలదీశారు.
వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తాడన్న పేరుందన్నారు. సిగ్గూ శరం ఉంటే బీజేపతో తాను కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు.
Also Read : కాంగ్రెస్ కు ‘కోమటిరెడ్డి’ గుడ్ బై