Nitish Kumar : అరెస్ట్ వారెంట్ గురించి తెలియ‌దు – సీఎం

స్ప‌ష్టం చేసిన నితీశ్ కుమార్

Nitish Kumar : సుదీర్ఘ అనుబంధానికి తెర దించారు సీఎం నితీశ్ కుమార్. దీంతో క‌సితో ర‌గిలి పోతోంది బీజేపీ. ఎలాగైనా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దించి అల్ల‌క‌ల్లోలం చేయాల‌ని చూస్తోంది.

ఆ దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ , త‌దిత‌ర పార్టీల‌తో క‌లిపి మ‌హా కూట‌మిగా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని నెల‌కొల్పారు. 31 మందితో కేబినెట్ కూడా కొలువు తీరింది.

అయితే కొత్త‌గా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన న్యాయ శాఖ మంత్రికి అరెస్ట్ వారెంట్ అందింది. కాగా మీ మంత్రి అరెస్ట్ కాబోతున్నార‌ట క‌దా అన్న ప్ర‌శ్న‌కు సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) బుధవారం బ‌దులు ఇచ్చారు.

ఆ విష‌యం గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నారు. కిడ్నాప్ కేసులో నితీశ్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కార్తికేయ సింగ్ అరెస్ట్ వారెంట్ ను ఎదుర్కొంటున్నారు.

తేజ‌స్వి యాద‌వ్ పార్టీకి సంబంధించిన మంత్రి కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కార్తికేయ సింగ్ ఆగ‌స్టు 16న కోర్టు ముందు లొంగి పోవాల్సి ఉంది. కానీ అదే రోజు నితీశ్ కుమార్ కొత్త ప్ర‌భుత్వంలోల మంత్రిగా కొలువు తీరారు.

బీహార్ ఎమ్మెల్సీ గా ఉన్నారు కార్తియ సింగ్ . 2014లో కిడ్నాప్ కేసులో 17 మంది నిందితులుగా ఉన్నారు. డిల్డ‌ర్ ను కిడ్నాప్ న‌కు పాల్ప‌డిన కేసులో సింగ్ కూడా ఒక‌రుగా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని త‌న‌పై ఎలాంటి వారెంట్ లేద‌న్నారు కార్తికేయ సింగ్.

Also Read : గ‌డ్క‌రీ..చౌహాన్ ఔట్ యెడ్డీకి చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!