Marri Sashidhar Reddy : రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం
నాశనం కావడానికి ఆయనే కారణం
Marri Sashidhar Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి(Marri Sashidhar Reddy)) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ కూరుకు పోయిందన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఇబ్బందికరంగా మారిందన్నారు.
మాణిక్యం ఠాగూర్ ఏం చెప్పినా పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పారు. తెలంగాణపై మంచి పట్టు కలిగి ఉన్న , థింక్ ట్యాంకర్ గా పేరొందిన దాసోజు శ్రవణ్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
ఇక మరికొందరు అదే బాటలో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో పార్టీని నడిపించాల్సిన రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం, అగ్నికి ఆజ్యం పోయడం ఇబ్బందికరంగా మారిందని వాపోయారు మర్రి శశిధర్ రెడ్డి.
రోజు రోజుకు పార్టీలో పని చేయాలంటేనే మనస్సు ఒప్పడం లేదన్నారు. పార్టీ యశ్వంత్ సిన్హాకు బేషరతుగా మద్దతు ఇచ్చింది. ఈ సమయంలో వారిని కలిసేందుకు వెళ్లిన సీనియర్ నాయకుడు వీహెచ్ ను అనరాని మాటలు అన్నారు.
బండ కేసి కొడతానని అనడం ఆయన స్థాయికి తగదన్నారు మర్రి శశి ధర్ రెడ్డి. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఏమీ లేదన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదన్నారు రెడ్డి. మాణిక్యం ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : మోదీజీ ఇదేనా నారీ శక్తి అంటే – కేటీఆర్
