Manickam Tagore : నేను సోనియాకు మాత్ర‌మే ఏజెంట్ ని

రేవంత్ రెడ్డికి కాద‌న్న మాణిక్యం ఠాగూర్

Manickam Tagore : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి. ఆయ‌న మాజీ సీఎం చెన్నారెడ్డి త‌న‌యుడు.

రేవంత్ రెడ్డికి ఠాగూర్ ఏజెంట్ గా మారార‌ని, ప‌ని చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించారు మాణిక్యం ఠాగూర్.

తాను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌కు, పార్టీకి మాత్ర‌మే ఏజెంట్ న‌ని వేరే వాళ్ల‌కు కాద‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో పార్టీ లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు హై క‌మాండ్ తెలుసు కుంటోంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు.

ఎవ‌రు ఏం చేస్తున్నారో , ఎవ‌రెవ‌రితో క‌లుస్తున్నారో కూడా తెలుస‌న్నారు. ఎవ‌రైనా పార్టీ కోసం ప‌ని చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ వ్య‌క్తుల కంటే పార్టీ ముఖ్య‌మ‌న్నారు.

మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి లాంటి సీనియ‌ర్ నాయ‌కుడు ఇలాంటి ప‌ద‌జాలం వాడుతాడ‌ని తాను అనుకోలేద‌న్నారు. ఏదైనా ఒక‌రి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాని సూచించారు.

తాను ఇన్ చార్జీ మాత్ర‌మేన‌ని నిర్ణ‌యం తీసుకునే అధికారం త‌న‌కు ఉండ‌ద‌న్నారు. ఎంత సేపు పార్టీకి అధినాయ‌క‌త్వానికి మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తానే త‌ప్పా అంతా నా చేతుల్లో ఏమీ ఉండ‌ద‌ని తెలుసుకుంటే బెట‌ర్ అని సూచించారు శ‌శిధ‌ర్ రెడ్డికి మాణిక్యం ఠాగూర్(Manickam Tagore).

ఇదిలా ఉండ‌గా మ‌ర్రి చేసిన కామెంట్స్ తో క‌ల‌క‌లం రేగింది కాంగ్రెస్ పార్టీలో.

Also Read : రేవంత్ రెడ్డి వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!