CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్ పై. ఆయన దాడిని మరింత పెంచారు. ప్రజలు మేల్కోక పోతే ప్రమాదంలో పడతారని హెచ్చరించారు.
దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్ గిరి సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం. సమాజం పట్ల ఎరుక అన్నది లేక పోతే ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమన్నారు కేసీఆర్(CM KCR).
58 ఏళ్ల పాటు పోరాడితే ఇవాళ తెలంగాణ ఏర్పడింది. స్వయం సమృద్దిని సాధించాం. దీనిని రాకుండా అడ్డుకోవాలని చూశారు.
కానీ నేనొక్కడినే బయలు దేరా. రాష్ట్రం ఇచ్చేంత దాకా తాను కాలు పెట్టనని శపథం చేశా. అనుకున్నట్టుగానే సాధించా. ఆచరణలో చేసి చూపించానని చెప్పారు కేసీఆర్.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడొస్తుందోనన్న బాధ ఉండేది. కానీ ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు కేసీఆర్.
ప్రజల్ని మత్తు లోకి దించుతోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని ఆరోపించారు. భారత దేశాన్ని కులం, మతం ప్రాతిపదికన విభజన చేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. వేలాది మంది బలిదానాలు చేసుకుంటే వచ్చిందీ దేశానికి స్వతంత్రం అన్నారు సీఎం. రాజకీయాల్లో గుణనాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.
అది లేక పోతే కష్టమన్నారు. చైనా, సింగపూర్ , కొరియా లాంటి దేశాలు ఎలా పురోగమించాయో తెలుసు కోవాలన్నారు కేసీఆర్. మరోసారి సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : తెలంగాణ ఆదర్శం మోదీ ఆటంకం – కేసీఆర్
