Sonali Phogat : సోనాలీకి డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారు
పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి
Sonali Phogat : హర్యానాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్, ప్రముఖ యాంకర్ గా పేరొందిన సోనాలీ ఫోగట్ గోవాలో స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ గుండె పోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు.
కానీ కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయడంతో పోస్ట్ మార్టంకు నివేదించారు. గోవా సీఎం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఆమె తమ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో దర్యాప్తు వేగవంతంగా జరిగింది.
చివరకు పోస్ట్ మార్టమ్ (శవ పరీక్ష)లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సోనాలీ ఫోగట్ శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీస్ చీఫ్ వెల్లడించారు.
దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆమె కుటుంబీకులు ఆందోళన చెందినట్లుగానే సోనాలీ ఫోగట్ సహాయకుడు, అతడి ఫ్రెండ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనికి సంబంధించి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా సోనాలీ ఫోగట్(Sonali Phogat) కేసుకు సంబంధించి శుక్రవారం సంచలన విషయం వెలుగు చూసింది. సోనాలీ ఫోగట్ కు మత్తు మందు ఇచ్చినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
గోవా లోని ఓ రెస్టా రెంట్ లో పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సహచరులు బలవంతంగా మత్తు మద్దు కలిపారు.
రెస్టారెంట్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులైన సుదీర్ సంగ్వాన్ , సుఖ్ విందర్ లను ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నారని తెలిపారు.
Also Read : ఖుష్బూ సుందర్ కు శశి థరూర్ కితాబు