Munawar Faruqui : మునావర్ ఫారూఖీ కామెడీ షో రద్దు
పర్మిషన్ ఇవ్వని ఢిల్లీ పోలీసులు
Munawar Faruqui : ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీకి కోలుకోలేని షాక్ తగిలింది. శనివారం దేశ రాజధాని ఢిల్లీ లో కామెడీ షో ఇవ్వాల్సి ఉంది.
కానీ ఆయన షోకు తాము అనుమతి ఇవ్వడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు ఢిల్లీ పోలీసులు. విశ్వ హిందూ పరిషత్ ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మునావర్ ఫారూఖీపై.
ఆయన హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా కామెంట్స్ చేస్తున్నాడని, తన కామెడీ షోలను కేవలం విద్వేషాలను రెచ్చ గొట్టేందుకే ప్రయత్నిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ముందు జాగ్రత్తగా తాము మునావర్ ఫారూఖీకి(Munawar Faruqui) కామెడీ షో చేపట్టేందుకు అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆమె మునావర్ ఫారూఖీకి మద్దతుగా నిలిచారు. ఒక కళాకారుడు స్వేచ్చగా తను చెప్పాలని అనుకున్నది చెప్పే హక్కు ఉందన్నారు. ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకోవడం ఢిల్లీ పోలీసులకే చెల్లింది.
మరో వైపు ఆమె నిప్పులు చెరిగారు. ఖాకీలను వెన్నెముక లేని వాళ్లంటూ సంచలన కామెంట్స్ చేశారు మహూవా మోయిత్రా. ఇదిలా ఉండగా బెంగూరులో షో రద్దయింది.
కానీ తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున భద్రత కల్పించింది మునావర్ ఫారూఖీ షోకు. శిల్ప కళా వేదికలో 2,90 0 మందికి పైగా కామెడీ షోకు హాజరయ్యారు.
కాగా తాము ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదనే దానిపై క్లారిటీ ఇచ్చింది ఢిల్లీ పోలీస్. హిందూ, ముస్లింల మధ్య సామరస్యం చెడి పోతుందనే ఉద్దేశంతో ఇవ్వలేదన్నారు.
Also Read : సోనాలీ కేసులో క్లబ్ ఓనర్..డ్రగ్ లీడర్ అరెస్ట్