Muruga Mutt Seer : మురుగ మఠం మఠాధిపతి అరెస్ట్
భారీ ఒత్తిళ్ల మధ్య అనుకోని ట్విస్ట్
Muruga Mutt Seer : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నాటకకు చెందిన మురుగ మఠం మఠాధిపతి శివమూర్తి శరణారావు(Muruga Mutt Seer) భారీ ఒత్తిళ్ల మధ్య అరెస్ట్ అయ్యారు.
తన మఠానికి చెందిన బాలికలను గత కొంత కాలం నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, మత్తు మందు ఇచ్చి రేప్ చేస్తున్నాడని బాలికలు ఆరోపించారు.
ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు. ఇదిలా ఉండగా కన్నడ నాట రాజకీయంగా శక్తివంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మత నాయకుడు ఈ మఠాధిపతి(Muruga Mutt Seer) .
పౌర సమాజం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఆయనను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది. ఇద్దరు మైనర్ బాలికలు తమపై మఠాధిపతి రేప్ చేశారంటూ ఆరోపించారు.
ఆరు రోజుల కిందట కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శివమూర్తి శరణారావు కు 64 ఏళ్లు. మురగ మఠానికి నేతృత్వం వహిస్తున్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు రాజకీయంగా తనను ఇరికించేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు మురుగ మఠం మఠాధిపతి.
తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ బాలికలు వాపోయారు. ఆరోపించిన వారిలో ఒక బాలిక దళిత వర్గానికి చెందినది కావడంతో కేసు మరింత సీరియస్ గా మారింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి 10.30 గంటలకు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
ఇదిలా ఉండగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మఠాధిపతిని కలిశారు. ఆశీర్వచనాలు అందుకున్నారు.
Also Read : సమాజం నిశ్శబ్దం ప్రమాదం