Chile President : ప్రెసిడెంట్ ప్ర‌సంగం చిన్నారి ఆనందం

సోష‌ల్ మీడియాలో వీడియో హ‌ల్ చ‌ల్

Chile President :  చిలీ దేశాధ్య‌క్షుడు వామ‌ప‌క్ష భావాలు క‌లిగిన నాయ‌కుడు. ఆయ‌న‌ను ఏరికోరి ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. ఆయ‌న ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఓ చిన్నారి సైకిల్ తో తిరుగాడుతూ ఉన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. చిలీ అధ్య‌క్షుడు గాబ్రియెల్ బోరిక్ మాట్లాడుతుండ‌గా చిన్నారి సూప‌ర్ మ్యాన్ ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపించాడు. నిజానికి అది మ్యాన్ ఆఫ్ స్టీల్ కాదు. కానీ సూప‌ర్ మ్యాన్ దుస్తులు ధ‌రించిన పిల్ల‌వాడు.

బోరిక్ చుట్టూ ఎలాంటి తొట్రు పాటుకు లోను కాకుండా బైక్ న‌డుపుతూ ఉన్నాడు. దీనిని చిత్రీక‌రించిన వీడియో ఇప్పుడు ల‌క్ష‌లాది మందిని ఆక‌ర్షించేలా చేస్తోంది.

ఎరుపు రంగు టోపీ, నీలి రంగు దుస్తులు ధ‌రించాడు. నీలి రంగు బైస్కిల్ కూడా. స్తానిక అవుట్ లెట్ 24 హోరాస్ ప్ర‌కారం రాజ్యాంగ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణకు ఓటు వేసిన త‌ర్వాత దేశ అధ్య‌క్షుడు మాట్లాడుతున్నాడు.

అయితే అక్క‌డ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది మాత్రం ఆ బాలుడు మాత్ర‌మే. చిన్నారి చేష్ట‌ల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

ఈ సంద‌ర్భంగా చిలీ అధ్య‌క్షుడు బోరిక్ చిలీయ‌న్ల‌ను(Chile President) కొత్త రాజ్యాంగానికి మ‌ద్ద‌తుగా ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ ఉద్వేగ భ‌రితంగా ప్ర‌సంగించారు.

కొన్ని రౌండ్ల త‌ర్వాత ఆ చిన్నారి ప్రెసిడెంట్ చెబుతున్న‌ది కొద్ది సేపు విన్నాడు. ఆ త‌ర్వాత త‌ను మ‌ళ్లీ సైకిల్ పై చుట్టూ తిప్ప‌డం స్టార్ట్ చేశాడు. కాగా ఇంత‌కీ ఆ పిల్ల‌వాడు ఎవ‌ర‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Also Read : వైట్ హౌస్ కు తిరిగి వ‌చ్చిన ఒబామా

Leave A Reply

Your Email Id will not be published!