Prashant kishor : నితీశ్ పై పీకే ట్వీట్ ఆపై డిలీట్
వ్యూహకర్త కామెంట్స్ ఆసక్తికరం
Prashant kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant kishor) ఏది చేసినా లేదా ఏది మాట్లాడినా, ట్వీట్ చేసినా అదో సంచలనం. ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించిన ట్వీట్ కలకలం రేపింది.
తాజాగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ లో . గత 17 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో జేడీయూ బంధం కొనసాగింది.
ఇటీవల ఆ బంధాన్ని తెంచుకున్నారు నితీశ్ కుమార్(Nitish Kumar). జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస పార్టీలతో కలిపి మహా ఘట్ బంధన్ పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. 31 మందితో కొత్త క్యాబినెట్ రూపొందించాడు.
ఇదే సమయంలో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ(PM Modi), బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు నితీశ్ కుమార్.
ఇప్పటికే ఆయన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తమది థర్డ్ ఫ్రంట్ కాదని మెయిన్ ఫ్రంట్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా దీనిని తప్పు పడుతూ స్పందించాడు ప్రశాంత్ కిషోర్. ట్విట్టర్ వేదికగా నితీశ్ కుమార్, ప్రధాన మంత్రి మోదీ కలిసి నవ్వుతూ, షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలను షేర్ చేశాడు.
నిమిషాల్లోనే అవి వైరల్ గా మారాయి. ఇది దేనికి సంకేతం అంటూ పేర్కొన్నాడు పీకే. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ తాను గురువుగా భావించే నితీశ్ కుమార్ కు సంబంధించిన ఫోటోస్ ను డిలీట్ చేశాడు.
Also Read : నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకుడు