PM Modi Viral : నెట్టింట్లో న‌రేంద్ర మోదీ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో ఆయ‌నే టాప్

PM Modi Viral : ప్ర‌స్తుతం భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi Viral) మోస్ట్ పాపుల‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. గ‌తంలో ప‌ని చేసిన పీఎంల కంటే ఆయ‌న భిన్నంగా త‌నదైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు.

ఉక్కు మ‌నిషిగా పేరొందిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ను మోదీ గుర్తుకు తెచ్చేలా చేస్తున్నారు. ఆయ‌న క‌నుస‌న్న‌ల‌లో ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ , దాని అనుబంధ సంస్థ‌లు కొన‌సాగుతున్నాయి.

ఒక‌ప్పుడు బీజేపీ అంటే లాల్ క్రిష్ణ అద్వానీ, అట‌ల్ బిహారీ వాజ్ పేయి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి అని పేరుండేది. కానీ ఎప్పుడైతే న‌రేంద్ర మోదీ 2014లో దేశానికి ప్ర‌ధాన మంత్రి అయ్యారో ఆనాటి నుంచీ సీన్ మారింది.

సిస్ట‌మ్ మారింది. ఎవ‌రైనా స‌రే మోదీ అంటేనే బీజేపీగా మారి పోయింది. అలా చేసుకుంటూ త‌న‌ను తాను మ‌ల్చుకుంటూ వ‌చ్చారు. ఇక సోష‌ల్ మీడియాలో మోదీ మోస్ట్ పాపుల‌ర్ ఐకానిక్ గా గుర్తింపు పొందారు.

క్ష‌ణాల్లోనే ప్ర‌పంచ మంత‌టా ప్ర‌ధాన మంత్రి(PM Modi Viral) త‌నదైన శైలిలో దూసుకు పోతున్నారు. గూగుల్ లో ఒక్క‌సారి మోదీ పేరు సెర్చ్ చేస్తే ల‌క్ష‌లాదిగా ఫోటోలు , స‌మాచారం ద‌ర్శ‌నం ఇస్తుంది.

ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రి వివిధ సంద‌ర్భాల‌లో తాను పాల్గొన్న కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫోటోల‌ను ఒక చోట చేర్చారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోల‌న్నీ వైర‌ల్ గా మారాయి.

సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎంతైనా మోదీ త‌ర్వాత ఎవ‌రైనా పార్టీలోనైనా ప్ర‌భుత్వ‌మైనా అని ప్ర‌చారం జ‌రుగుతోంది పార్టీలో ఇంటా బయ‌టా. ఏది ఏమైనా మోదీ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ అని ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.

Also Read : టాటాల‌ను దాటేసిన‌ అదానీ గ్రూప్

Leave A Reply

Your Email Id will not be published!