RK Roja : బాబు కోసమే జ‌న‌సేన భ‌జ‌న – రోజా

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మంత్రి కామెంట్స్

RK Roja : ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ప‌వ‌ర్ స్టార్ , జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Janasena Pawan Kalyan) ను టార్గెట్ చేశారు. ఆయ‌న‌పై నిప్పులు చెరిగారు ఆర్కే రోజా.

జ‌న‌సేన పార్టీ ఎందుకు పెట్టాడో ఈరోజు వ‌ర‌కు ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌న్నారు. కేవ‌లం టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడికి స‌పోర్ట్ చేసేందుకు మాత్ర‌మే జ‌న‌సేన ప‌ని చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధారాలు లేకుండా, స‌మాచారం తెలుసు కోకుండా ఎలా ప‌డితే అలా కామెంట్స చేస్తున్నార‌ని ఇది ఒక నాయ‌కుడికి ఉండాల్సిన లక్ష‌ణం కాద‌న్నారు ఆర్కే రోజా.

ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే ద‌మ్ము, ధైర్యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు లేద‌న్నారు. బాబు ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందు కోసం త‌ను ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆయ‌న‌కు అంత సీన్ లేద‌ని కొట్టి పారేశారు మంత్రి.

రాజ‌కీయాలు వేరు సినిమాలు వేర‌న్నారు. గ‌తంలో చాలా మంది ఇలాగే ప్ర‌గ‌ల్బాలు ప‌లికార‌ని ఆ త‌ర్వాత కామ్ గా ఉండి పోయార‌ని గ‌తం గుర్తు చేశారు ఆర్కే రోజా(RK Roja).

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌లో పోటీ చేసే ద‌మ్ముందా అని స‌వాల్ విసిరారు. పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు లేర‌ని ఇక శాస‌న‌స‌భ‌లో జ‌న‌సేన జెండా ఎలా ఎగుర వేస్తారంటూ ప్ర‌శ్నించారు మంత్రి.

ఎమ్మెల్యేల సంగ‌తి ప‌క్క‌న పెట్టిండి ముందు రాష్ట్రంలోని స‌ర్పంచ్ ప‌ద‌వుల్లో పోటీ చేసి గెల‌వండి అంటూ ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.

Also Read : ఢిల్లీ స్కామ్ లో ప్ర‌మేయం అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!