Pay CM Posters : ‘పే సీఎం’ బొమ్మై పోస్టర్ల కలకలం
కర్ణాటక అవినీతిపై ఆగ్రహం
Pay CM Posters : కర్ణాటకలో చోటు చేసుకున్న అవినీతిపై సీఎం బస్వరాజ్ బొమ్మైని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన ఫోటోతో ఉన్న – పే సీఎం – పోస్టర్లను నగరమంతటా అంటించారు.
ఎక్కడ చూసినా పేసీఎం పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో నగర పాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. అంటించిన పోస్టర్లను తొలగించే పనిలో పడ్డాయి.
దేశ వ్యాప్తంగా కర్ణాటక పే సీఎం పోస్టర్ల(Pay CM Posters) వ్యవహారం చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా మత కల్లోలాలు, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారి పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుత సీఎం బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై. తాజాగా ఏకంగా సీఎంనే లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు దర్శనం ఇస్తుండడం నగర వాసులను , పార్టీ పెద్దలను విస్తు పోయేలా చేసింది.
ఈ పోస్టర్లు అత్యంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఈ పోస్టర్లు అచ్చం పే టీఎం లాగానే ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఇవి.
సీఎం బొమ్మై క్యూ ఆర్ కోడ్ మధ్యలో ఇక్కడ 40 శాతం అంగీకరించ బడింది అనే సందేశాన్ని కూడా పొందు పరిచారు పోస్టర్లపై.
ప్రభుత్వ కాంట్రాక్టులు, ఉద్యోగాల భర్తీ విషయంలో అవినీతికి కేరాఫ్ గా ప్రస్తుత ప్రభుత్వం మారి పోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూనే వచ్చింది.
రాష్ట్ర సర్కార్ కి వ్యరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు(Pay CM Posters) వెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్సిపల్, నగర పాలక సంస్థల అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
ఎక్కడికక్కడ పోస్టర్లను తీసి వేసే పనిలో నిమగ్నం అయ్యారు.
Also Read : పీఎం కేర్స్ ట్రస్టీలుగా టాటా..థామస్..సుధా