Venkaiah Naidu : నరేంద్ర మోదీ పుస్తకం విడుదలకు సిద్దం
ఆవిష్కరించనున్న వెంకయ్య నాయుడు
Venkaiah Naidu : భారత దేశంలో మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరొందారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఆయన చేసిన ప్రసంగాలు చాలా కీలకమైనవి. ఈ సందర్భంగా మొత్తం కీలకమైన అంశాలకు సంబంధించి మోదీ చేసిన ప్రసంగాలను ఏరికూర్చి ఓ పుస్తకంగా అచ్చు వేశారు.
ప్రస్తుతం ఆ అరుదైన పుస్తకం విడుదలకు సిద్దమైంది. దీనిని తలపండిన రాజకీయ నాయకుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు.
ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకే చట్రంలో పైకి వచ్చిన వారే కావడం విశేషం. ఒకరు చాయ్ వాలా నుంచి ప్రధాన మంత్రిగా ఎదిగారు.
మరొకరు రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. ఇక ఈ పుస్తకం ఎలా ఉండబోతోందననే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో వివిధ అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన 86 ప్రసంగాలపై ఫోకస్ పెట్టింది.
ఈ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు విడుదల (Venkaiah Naidu) చేస్తారు శుక్రవారం. సబ్కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ – ప్రధాన మంత్రి మోదీ మాట్లాడతారు అనే పుస్తకాన్ని సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి విడుదల చేయనున్నారు.
ఇందులో కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల మోదీ జీవిత ప్రస్థానం , సాధించిన విజయాలతో పుస్తకాన్ని విడుదల చేశారు.
Also Read : మోదీని ఆకాశానికి ఎత్తేసిన ఇమ్రాన్ ఖాన్