Chup Pooja Bhatt : చుప్ లో పాత్ర మరిచి పోలేను – పూజా భట్
ఆల్కహాల్, డిప్రెషన్ అనేది సర్వ సాధారణం
Chup Pooja Bhatt : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ గారాల కూతురు నటి పూజా భట్ చాలా కాలం తర్వాత మరోసారి వార్తల్లో నిలిచారు. చివరిసారిగా ఆమె 1999లో జఖ్మ్ మూవీలో నటించారు.
తాజాగా ఆర్. బాల్కీ దర్శకత్వంలో చుప్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూజా భట్(Chup Pooja Bhatt) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్కహాల్ (మందు), డిప్రెషన్ పై కీలక కామెంట్స్ చేశారు.
సినీ రంగానికి చెందిన వారిలో చాలా మంది డిప్రెషన్ కు లోనవుతారని పేర్కొన్నారు. ఎంతో పాపులారిటీ ఉన్నా ఒక్కోసారి అనుకున్న రీతిలో సినిమాలు ఆడక పోతే ఆ తర్వాత జనం పలకరించరన్న సత్యాన్ని ప్రస్తావించారు పూజా భట్.
ది ఫ్రీ జర్నల్ తో ఆమె తన ఆలోచనలు, అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం నటి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. మద్యం వ్యసనం, డిప్రెషన్ కారణంగా తాను చుప్ సినిమాలో నటించేలా చేశాయని చెప్పారు పూజా భట్(Chup Pooja Bhatt).
కాస్టింగ్ ఏజెంట్ దర్శకుడు ఆర్. బాల్కీ గురించి చెప్పాడు. స్క్రిప్ట్ పంపమని చెప్పా. నేను పూర్తిగా చదివాను. చాలా నచ్చిందని చెప్పారు. చుప్ లోని జెనోబియాలో నా పాత్ర బాంబే బేగమ్స్ లోని రాణి కంటే భిన్నంగా ఉంటుందన్నారు.
ఒక రకంగా దర్శకుడు బాల్కీ దిల్ హై కే మాన్తా నహీ చిత్రాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేలా చేశాడని ప్రశంసలతో ముంచెత్తింది పూజా భట్.
బొంబాయి బేగమ్స్ నాకు తెగ నచ్చిందని చెప్పింది పూజా భట్. సడక్ -2 కూడా వస్తోందన్నారు. నేను అత్యంత అందమైన దశలో ఉన్నానని చెప్పింది.
Also Read : హాలీవుడ్ ఏజెన్సీతో రాజమౌళి డీల్