Xi Jinping House Arrest : చైనాలో సైనిక తిరుగుబాటు
గృహ నిర్బంధంలో జిన్ పింగ్
Xi Jinping House Arrest : చైనాలో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. దీనికి ప్రధాన కారణం సైనిక చర్యేనన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్(Xi Jinping House Arrest) ను గృహ నిర్బంధంలో ఉంచారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జిన్ పింగ్ ను ఉన్నత కార్యాలయం నుండి ప్రెసిడెంట్ ను తప్పించినట్లు టాక్.
ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఇటీవల సమర్ కండ్ లో జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ లేదా ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు జిన్ పింగ్.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చీఫ్ గా జిన్ పింగ్ ను తొలగించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చోటు చేసుకుంది. కాగా చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా జాతీయ మీడియా సైతం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
జిన్ పింగ్ గృహ నిర్బంధంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం లేదు. భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు.
ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. అయితే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యాన్ని నియంత్రించినందున జిన్ పింగ్ ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. జిన్ పింగ్ స్థానంలో చైనా అధ్యక్షుడిగా లీ కియా మింగ్ బాధ్యతలు చేపట్టారని టాక్ వినిపిస్తోంది.
Also Read : చైనా కింగ్ లి కియా మింగ్