AP Ministers : బాలయ్య కామెంట్స్ వైసీపీ సీరియస్
ఫ్లూటు చంద్రబాబు ముందు ఊదు
AP Ministers : యూనివర్శిటీ పేరు మార్పుపై ఏపీలో రాద్దాంతం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు, మంత్రులు మండిపడ్డారు.
నీ ప్లూటు చంద్రబాబు నాయుడు ముందు ఊదాలని, జగన్ మోహన్ రెడ్డి ముందు కాదన్నారు. వైఎస్సార్ వర్సిటీ అంశంపై బాలకృష్ణ కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మంత్రులు ఎదురు దాడికి దిగారు.
ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్టీఆర్ఎస్ హెచ్ ) పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చడంపై బాలకృష్ణ భగ్గుమన్నారు. ఆయన ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.
దీనిపై మంత్రులు(AP Ministers) తీవ్రంగా మండిపడ్డారు. బాలయ్యా వైస్రాయ్ హోటల్ లో మీ బావ చంద్రబాబు నాయుడు మీ నాన్నపై చెప్పుళ్లు విసురుతున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూ డ్రింక్ చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీ పార్టీకే ఉందన్నారు. కాగా కృష్ణా జిల్లాలో కొంత భాగానికి దివంగత ఎన్టీఆర్ పేరు మార్చిన ఘనత తమదేనని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర్ రావు స్పందించారు. దయచేసి మీ ఫ్లూట్ ను చంద్రబాబు నాయుడు వద్ద ఊదండి. కానీ జగన్ మోహన్ రెడ్డి ముందు ఊదకండన్నారు.
అలా ఊదితే అడ్రస్ లేకుండా పోతారని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీఎం కుర్చీలో కూర్చున్నది రీల్ సింహం కాదని అసలైన సింహమని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
Also Read : డిజిటల్ హెల్త్ సర్వీసెస్ లో ఏపీ టాప్