Lashkar Terrorist Killed : షోపియాన్ లో ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాది ఖ‌తం

న‌సీర్ అహ్మ‌ద్ భ‌ట్ గా గుర్తింపు

Lashkar Terrorist Killed : జ‌మ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ లో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు. పోలీసులు ఉగ్ర‌వాదిని నౌపారా ప్రాంతానికి చెందిన న‌సీర్ అహ్మ‌ద్ భ‌ట్ గా గుర్తించారు. స‌ద‌రు ఉగ్ర‌వాది ప‌లు ఉగ్ర‌వాద నేరాల‌లో పాల్గొన్నాడు. ఇటీవ‌ల ఎన్ కౌంట‌ర్ సైట్ నుండి త‌ప్పించుకున్నాడు.

ఈ ఘ‌ట‌న ఆదివారం చోటు చేసుకుంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది(Lashkar Terrorist Killed) ఖ‌త‌మైన‌ట్లు జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్పారు. ద‌క్షిణ కాశ్మీర్ లోని బాస్కుచాన్ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల ఉనికి గుర్తించి నిర్దిష్ట స‌మాచారం అందుకున్నాయి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు. అక్క‌డ కార్బ‌న్ , సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించాయి.

ఆ ప్రాంతంలో బ‌ల‌గాలు సోదాలు నిర్వ‌హిస్తుండ‌గా ఉగ్ర‌వాదులు త‌మ‌పై కాల్పులు జ‌రిపార‌ని తెలిపారు ఖాకీలు. బ‌ల‌గాలు ప్ర‌తీకారం తీర్చుకున్నాయ‌ని ఎన్ కౌంట‌ర్ లో ఎల్ఇటి ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడ‌ని పేర్కొన్నారు. కాశ్మీర్ అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ విజ‌య్ కుమార్ ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల తాము జ‌రిపిన కాల్పుల్లో త‌ప్పించుకున్నాడ‌ని కానీ ఇవాళ జ‌రిగిన కాల్పుల్లో త‌మ దాడుల నుంచి త‌ప్పించు కోలేక పోయాడ‌ని చెప్పారు. ప్ర‌ధానంగా న‌సీర్ అహ్మ‌ద్ భ‌ట్ గ‌త కొంత కాలంగా పోలీసుల‌ను టార్గెట్ చేశాడ‌ని, ప‌లు నేరాలకు ప్లాన్ చేశాడ‌ని చెప్పారు. ఉగ్ర‌వాద సంస్థతో సంబంధం క‌లిగి ఉన్నాడ‌ని చెప్పారు. ఏకే రైఫిల్ తో స‌హా నేరారోప‌ణ చేసే ప‌దార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు.

Also Read : పుల్వామాలో ఉగ్ర‌మూక కాల్పుల మోత‌

Leave A Reply

Your Email Id will not be published!