AAP Mla Bharaj : ఆప్ మహిళా ఎమ్మెల్యే పెళ్లి వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్
AAP Mla Bharaj : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు హంగు, ఆర్భాటాలు, మందీ మార్బలం వచ్చేస్తుంది. వారు ప్రదర్శించే దర్పం అంతా ఇంతా కాదు. కానీ తాను ఎమ్మెల్యేగా గెలుపొందినా ఎలాంటి ప్రచారం లేకుండానే కూల్ గా తన పార్టీలో సాదా సీదాగా పని చేసిన కార్యకర్తను పెళ్లి చేసుకున్న ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే, కార్యకర్తల వివాహం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 28 ఏళ్ల నరీందర్ కౌర్ భరాజ్ (AAP Mla Bharaj ) సంగ్రూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. విచిత్రం ఏమిటంటే గెలుపొందిన 92 మంది ఆప్ ఎమ్మెల్యేలలో వయసు రీత్యా భరాజ్ అత్యంత పిన్న వయస్కురాలు.
ఇంకొకరైతే నానా హంగామా చేసే వారు. కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా, తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలన్నది తమ ఆశయమని పేర్కొంది ఈ యువ ఎమ్మెల్యే. పటియాలా లోని బవా పూరన్ దాస్ డేరాలో ఎమ్మెల్యే, కార్యకర్త మన్ దీప్ సింగ్ ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి ప్రముఖులను పిలవక పోవడం విశేషం.
ఇదిలా ఉండగా ఈ ఇద్దరూ ఆప్ లో 2014 నుంచి పని చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటారు. ఇద్దరూ పని చేస్తున్న సమయంలోనే ప్రేమించుకున్నారు. ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినా చాలా సాధారణంగా కార్యకర్తను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు దారితీసింది.
వీరి పెళ్లికి కొంత మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోవాలని సమాజానికి మెస్సేజ్ ఇచ్చేందుకు ఇలా చేశామని చెప్పింది ఈ జంట.
Also Read : గిరి గీసి చెబుతున్నా బరిలో ఉన్నా – థరూర్