Suvendu Adhikari : సువేందు అధికారి షాకింగ్ కామెంట్స్
మొమిన్ పూర్ అల్లర్ల వెనుక ఉగ్ర సంస్థలు
Suvendu Adhikari : భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు సువేందు అధికారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ని మొమిన్ పూర్ లో జరిగిన అల్లర్ల వెనుక ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా , ఐసిస్ వంటివి ఉన్నాయని ఆరోపించారు. అక్కడ కేంద్ర బలగాలను వెంటనే మోహరించాలని కోరారు.
బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందేలా చూడాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించి అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని సువేందు అధికారి(Suvendu Adhikari) డిమాండ్ చేశారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా ఏకంగా 5 వేల మందికి పైగా హిందువులు కోల్ కతాను విడిచి పెట్టి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ కు , హోం శాఖ మంత్రికి లేఖలు రాశారు. పూర్తిగా అల్ ఖైదా, ఐసిస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక పూర్తిగా ఇంటర్నెట్ ను నిలిపి వేశారు. ఆపై అల్లర్లకు పాల్పడ్డారు.
ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని ఆరోపించారు సువేందు అధికారి(Suvendu Adhikari). బెంగాలీ హిందువులు వలస వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు. ఇదిలా ఉండగా గత ఎన్నికలు జరిగినప్పటి నుంచీ బీజేపీ వర్సెస్ టీఎంసీ మధ్యన మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే కేసులు, దర్యాప్తులు, అరెస్ట్ లు, ఆందోళనలు, దాడులు , హత్యలతో అట్టుడుకుతోంది పశ్చిమ బెంగాల్. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దూకుడు పెంచాయి.
Also Read : బెంగాల్ జాబ్స్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్