Temjen Imna : విమ‌ర్శ‌లు మ‌రింత బ‌లాన్ని ఇస్తాయి – ఇమ్నా

నాగాలాండ్ ఉన్న‌త విద్యా శాఖ మంత్రి కామెంట్స్

Temjen Imna : టెమ్ జెన్ ఇమ్నా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఓ ఐకాన్ కూడా. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiran Rijiju) కూడా అంతే పాపుల‌ర్ క‌లిగిన నాయ‌కులుగా గుర్తింపు పొందారు.

అయితే టెమ్ జెన్ ఇమ్నా వెరీ వెరీ స్పెష‌ల్. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా లేదా ఏది ప్ర‌స్తావించినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. అంత‌లా ప్ర‌జ‌ల్లోకి దూసుకు పోయారు. ప్ర‌ధానంగా ఈ నాగాలాండ్ కేబినెట్ మంత్రి క‌ళ్లు, ఆహార్యం గురించి ఇప్ప‌టికీ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది సామాజిక మాధ్య‌మాల్లో. తాజాగా టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

విమ‌ర్శ‌లు ఎంత‌గా మ‌న‌పై వ‌స్తే అంతకు మించి బ‌ల‌ప‌డేందుకు దోహ‌దం చేస్తుంద‌ని పేర్కొన్నారు. తాను క‌లిసిన ప్ర‌జ‌ల‌తో ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అవి ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టెమ్ జెన్ ఇమ్నా చెప్పే ప్ర‌తి మాట ఓ కొటేష‌న్ లాగా అక్క‌డి ప్ర‌జ‌లు ముఖ్యంగా యూత్ ఫాలో అవుతూ వ‌స్తుంటారు.

ఆయ‌న మాట్లాడే మాట‌లు అత్యంత ప్ర‌భావం చూపేలా ఉంటాయి. అందుకే అత‌డికి ఫాలోయింగ్. తాజా మంత్రి ఏమ‌న్నారంటే విమ‌ర్శ‌ల‌కు మ‌నం ప్ర‌తిస్పందించే విధానం ప్ర‌శంస‌ల‌కు ప్ర‌తిస్పందించే విధానంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు.

ప్ర‌శంస‌లు మ‌న‌ల్ని అణ‌గ‌దొక్కితే విమ‌ర్శ‌లు మ‌న‌ల్ని బ‌ల‌ప‌రుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ప్ర‌శంస‌లు మ‌న‌ల్ని పెంచితే విమ‌ర్శ‌లు మ‌న‌ల్ని న‌లిపి పారేస్తాయ‌న్నాడు. రెండు స్పంద‌న‌లు మ‌న ఓట‌మికి దారి తీస్తాయ‌ని హెచ్చ‌రించాడు టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna) .

Also Read : హిజాబ్ ధిక్కారం ఇరాన్ అథ్లెట్ కు స్వాగ‌తం

Leave A Reply

Your Email Id will not be published!