Nitish Kumar : పీకేకు పబ్లిసిటీ పిచ్చి – నితీశ్ కుమార్
భారతీయ జనతా పార్టీతో నో ఛాన్స్
Nitish Kumar : బీహార్ లో రాజకీయాలు మరింత గరం గరంగా మారాయి. భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆయన మనస్సంతా ఇంకా బీజేపీతోనే ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం, పీకే మధ్య నువ్వా నేనా అంటూ మాటల యుద్దం కొనసాగుతోంది. దీనిపై శుక్రవారం సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పదే పదే పీకే గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar). ఆయనకు ఇంకా అనుభవం తక్కువ అని పేర్కొన్నాడు.
నిత్యం వార్తల్లో ఉండాలని అనుకుంటాడు. ఈ దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రచారం యావ ఎక్కువ. ఆయనతో పాటు పీకేకు కూడా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అంటూ నిప్పులు చెరిగారు సీఎం. ఆయన చాలా చిన్నవాడు. నా రాజకీయ అనుభవంలో చూసుకుంటే ఇంకా పరిణితి చెందలేదు.
ప్రచారం కోసం ఏమైనా ఏదైనా మాట్లాడతాడంటూ పీకేపై ఎద్దేవా చేశారు నితీశ్ కుమార్. ప్రతిసారి టార్గెట్ చేయడం వల్ల తనకు ఏమీ కాదన్నారు. నితీశ్ కుమార్ ఎన్ని డక్కీ మొక్కీలు తిన్నాడో జనాలకు తెలుసన్నాడు. పీకే ఎంతగా రెచ్చగొట్టాలని చూసినా ఒరిగేది ఏమీ ఉండదన్నాడు.
బీహార్ లో ఆయన అనుకున్నంత స్ట్రాటజీ వర్కవుట్ కాదని, పీకే ఏం చేసినా బీజేపీ కోసం మాత్రమే పని చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు మరోసారి సీఎం.
Also Read : నా దగ్గర ఆధారాలు ఉన్నాయి – పీకే