PM Modi Gifts : పీఎం మోదీకి సీఎం ధామి స్పెష‌ల్ గిఫ్ట్

సంతోషం వ్య‌క్తం చేసిన ప్ర‌ధానమంత్రి

PM Modi Gifts : ఉత్త‌రాఖండ్ లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి అరుదైన గిప్ట్ ను(PM Modi Gifts) బ‌హూక‌రించారు సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి. బ్ర‌హ్మ క‌మ‌లంతో చెక్కిన సాంప్ర‌దాయ టోపీని ప్ర‌ధానికి బ‌హుమ‌తిగా అంద‌జేశారు. త‌న రాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స్థానికులు త‌యారు చేసిన వ‌స్తువుల‌నే ప్ర‌జ‌లు వాడాల‌ని పిలుపునిచ్చారు మోదీ.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప‌ర్య‌టించారు ప్ర‌ధాని. టూర్ అనంత‌రం ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం పుష్క‌ర్ సింగ్ త‌న‌కు టోపీని బ‌హూక‌రించ‌డంతో ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు మోదీ. స్వంతంగా త‌యారు చేసిన దానిని చూసి ఆయ‌న సంతోషానికి లోన‌య్యారు.

ఈ సంద‌ర్భంగా త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో సీఎం ధామి ఇచ్చిన టోపీని పంచుకున్నారు. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ గా మారింది. టోపీతో కాకుండా న‌రేంద్ర మోదీకి అల్మోరా నుండి త‌యారు చేసిన ప్ర‌సిద్ద‌మైన స్వీట్ల‌ను కూడా బ‌హూక‌రించారు. ప్ర‌జ‌లు, ప‌ర్యాట‌కులు త‌మ విలువైన డబ్బుల‌తో స్థానికులు త‌యారు చేసిన వ‌స్తువులు, ప‌రిక‌రాలు కొనుగోలు చేయాల‌ని కోరారు పీఎం.

ఇదిలా ఉండ‌గా చైనా స‌రిహ‌ద్దులో ఉన్న చివ‌రి గ్రామ‌మైన బ‌ద్రీనాథ్ మ‌నాలో జ‌రిగిన బ‌హిరంగ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉన్న ప్ర‌తి గ్రామాన్ని ఇప్పుడు భార‌త‌దేశపు మొద‌టి గ్రామంగా ప‌రిగ‌ణిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

అక్క‌డ జ‌రిగిన స‌ర‌స్ మేళాకు కూడా హాజ‌ర‌య్యారు పీఎం. స్థానిక క‌ళాకారుల‌తో సంభాషించారు. మేళాలో స్టాల్స్ ను సంద‌ర్శించి అభినందించారు.

Also Read : త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క మంత్రివ‌ర్గ‌ విస్త‌ర‌ణ – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!