Swati Maliwal : డేరా బాబా పెరోల్ రద్దు చేయండి
హర్యానా సీఎంకు మహిళా సంఘం
Swati Maliwal : డేరా బాబాగా ప్రసిద్ది చెందిన రామ్ రహీమ్ పెరోల్ ను రద్దు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సీతా మలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెంటనే నిలిపి వేయాలని కోరారు. ఇప్పటికే నేరారోపణలు ఎదుర్కొని 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు ఎలా పెరోల్ ఇస్తారంటూ ప్రశ్నించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు స్వాతి మలివాల్(Swati Maliwal). తక్షణమే రామ్ రహీమ్ పెరోల్ ను రద్దు చేసి జైలు శిక్ష విధించాలంటూ హర్యానా ప్రభుత్వానికి లేఖ రాశారు. డేరా బాబా ఇటీవల సునారియా జైలు నుంచి 40 రోజుల పెరోల్ పై విడుదలయ్యారు. అత్యాచారాలు, హత్య కేసుల్లో దోషిగా తేలారు రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా.
ఇలాంటి వ్యక్తికి ఎలా పెరోల్ ఇచ్చేందుకు అనుమతిస్తారని సీఎం ఖట్టర్ ను నిలదీశారు స్వాతి మలివాల్. చైర్ పర్సన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హర్యానా సీఎంపై. నేరారోపణలు రుజువై శిక్ష పడిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారంటూ నిలదీశారు. రామ్ రహీమ్ ఓ రేపిస్ట్ , హంతకుడు. అతడికి ఇప్పటికే కోర్టు జీవిత ఖైదు విధించింది.
కానీ హర్యానా ప్రభుత్వం అలాంటి నీచుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరోల్ ఇస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతి మలివాల్. డేరా బాబా డేర్ గా సత్సంగ్ నిర్వహిస్తున్నాడు. హర్యానా ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ , మేయర్ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం సిగ్గుతో తల వంచు కోవాల్సి వస్తుందన్నారు చైర్ పర్సన్.
Also Read : డేరా బాబా పెరోల్ పై సీఎం దాటవేత