Putin Modi : మోదీ విదేశాంగ విధానం సూప‌ర్ – పుతిన్

ర‌ష్యా అధ్య‌క్షుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Putin Modi : ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీపై(Putin Modi) ప్ర‌శంస‌లు కురిపించాడు. పీఎంను మోదీ నిజ‌మైన దేశ భ‌క్తుడంటూ కొనియాడారు. ప్ర‌స్తుతం పుతిన్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఎప్పుడైతే న‌రేంద్ర మోదీ కొలువు తీరాడో ఆనాటి నుంచి భార‌త్ అన్ని రంగాల‌లో అత్యంత శ‌క్తివంత‌మైన‌దిగా రూపుదిద్దుకుంద‌ని పేర్కొన్నారు పుతిన్.

మాస్కోకు చెందిన థింక్ ట్యాంక్ వాల్లై డిస్క‌ష‌న్ క్ల‌బ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్. న‌రేంద్ర మోదీ(PM Modi) అనుస‌రిస్తున్న విదేశాంగ విధానం అద్భుతం అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. కాగా పుతిన్ చేసిన ప్ర‌సంగాన్ని టూకీగా అనువాదం చేసింది ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ రాయిట‌ర్స్.

న‌రేంద్ర మోదీ తీసుకు వ‌చ్చిన మేక్ ఇన్ ఇండియా ఆలోచ‌న అద్భుత‌మ‌న్నారు. అంతే కాదు గొప్ప దేశ భ‌క్తుడు. ఆయ‌న గొప్ప విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని పేర్కొన్నారు వ్లాదిమిర్ పుతిన్. మోదీ ఆలోచ‌న భ‌విష్య‌త్తు భార‌త దేశానికి చెందిన‌ది.

అది గ‌ర్వించ ద‌గిన‌ది. ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక అని స్ప‌ష్టం చేశారు వ్లాదిమిర్ పుతిన్. ర‌ష్యా చీఫ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా మోదీకి ఉన్న ప‌వ‌ర్ ఏమిటో తెలియ చేస్తుంది.

Also Read : మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి – కనిమొళి

Leave A Reply

Your Email Id will not be published!