US Expresses : చైనాపై సీరియ‌స్ భార‌త్ కు స‌పోర్ట్ – అమెరికా

వ్యూహాత్మ‌క త‌ప్పిదంపై తీవ్ర ఆగ్ర‌హం

US Expresses : స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా బ‌ల‌వంత‌పు వ్యూహాల‌కు వ్య‌తిరేకంగా అమెరికా భార‌త్ కు(US Expresses)  మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. రాబోయే ద‌శాబ్దాల్లో యునైటెడ్ స్టేట్స్ కు అత్యంత ప‌ర్య‌వ‌సానంగా చైనాను వ్యూహాత్మాక పోటీదారుగా పేర్కొంది.

యుఎస్ జాతీయ ర‌క్ష‌ణ వ్యూహాం (ఎన్డీఎస్) భూమి, స‌ముద్రంలో చైనాను అరిక‌ట్టేందుకు దాని సామ‌ర్థ్యాన్ని పెంపొందించేందుకు భార‌త దేశంతో అమెరికా ప్ర‌ధాన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత లోతుగా చేసేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

భార‌త్ తో వివాదాస్ప‌ద స‌రిహ‌ద్దుతో స‌హా చైనా గ్రే జోన్ బ‌ల‌వంతానికి సంబంధించిన తీవ్ర‌మైన రూపాల‌కు వ్య‌తిరేకంగా మిత్ర దేశాలు , భాగ‌స్వామ్యుల‌కు యుఎస్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. జో బైడెన్(Joe Biden) ప‌రిపాల‌న త‌న జాతీయ భ‌ద్ర‌తా వ్యూహాన్ని విడుద‌ల చేసిన కొద్ది రోజుల త‌ర్వాత ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి లాయిడ్ జె ఆస్టిన్ ఎన్డీఎస్ ను విడుద‌ల చేశారు.

ఇది చైనాను(China) అధిగ‌మించ‌డం , రష్యాను నిర్బంధించ‌డం దాని ప్రాధాన్య‌త‌ను ప్ర‌క‌టించింది. వ్యూహానికి సంబంధించి త‌న ప‌రిచ‌య నోట్ లో రాబోయే ద‌శాబ్దంలో చైనా యుఎస్ అత్యంత ప‌ర్యవ‌సాన‌మైన వ్యూహాత్మ‌క పోటీదారుగా మిగిలి పోయంద‌ని ఆస్టిన్ చెప్పారు.

ఇండో ప‌సిఫిక్ ప్రాంతం, అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ను దాని అధికార ప్రాధాన్య‌త‌ల‌కు స‌రిపోయేలా మార్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మిల‌టరీని ఆధునీక‌ర‌ణ చేయాల్సి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు లాయిడ్ ఆస్టిన్. చైనాకు వ్య‌తిరేకంగా అమెరిక‌న్ ప్ర‌తిఘ‌ట‌న‌ను నిలుపుదామ‌ని పిలుపునిచ్చారు. ఇదే స‌మ‌యంలో భార‌త్ త‌న వంతు ప్ర‌య‌త్నంగా చ‌ర్య‌లు చేప‌ట్టడాన్ని స్వాగతించారు. విదేశాంగ విధానం బాగుంద‌ని కితాబు ఇచ్చారు.

Also Read : మోదీ విదేశాంగ విధానం సూప‌ర్ – పుతిన్

Leave A Reply

Your Email Id will not be published!