Elon Musk Fires : భారీ భద్రత మధ్య పరాగ్..సెగల్ అవుట్
ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ఎలాన్ మస్క్
Elon Musk Fires : అత్యంత కట్టుదిట్టమైన భారీ భద్రత మధ్య ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ ట్విట్టర్ ప్రధాన కార్యాలయం నుంచి వెళ్లి పోయారు.
ఎప్పుడైతే ట్విట్టర్ ను టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్(Elon Musk) కొనుగోలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అక్టోబర్ 28 శుక్రవారం వరకు ట్విట్టర్ తో అనుబంధం తెంచుకున్నారు. ఇదిలా ఉండగా ఎంతో అపారమైన నమ్మకమైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు పరాగ్ అగర్వాల్.
ట్విట్టర్ వ్యవస్థాపకుడు డార్సే ఏరి కోరి పరాగ్ అగర్వాల్ ను తన వారసుడిగా ప్రకటించారు. కానీ ఆయన పనితీరుపై ఎలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు.
పదే పదే అవమానానికి గురి చేస్తూ వచ్చారు. ఇక ట్విట్టర్ ను ఎప్పుడైతే డీల్ ను క్లోజ్ చేసిన మరుసటి క్షణం నుంచి సిఇఓ పరాగ్ అగర్వాల్ , చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సెగల్ తో పాటు ట్విట్టర్ లీగల్ హెడ్ గా ఉన్న విజయ గద్దె ను సాగనంపారు ఎలాన్ మస్క్. మరో వైపు ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఉద్యోగులు ట్విట్టర్ ను వీడారు.
ప్రస్తుతం కొద్ది మందితో మాత్రమే సంస్థను నడపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకే రోజు అత్యున్నత పదవులను అధీష్టించిన వారంతా ఒక్కసారిగా గుడ్ బై చెప్పడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది ట్విట్టర్ లో.
ఇదిలా ఉండగా వీరిని సాగనంపిన ఎలాన్ మస్క్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మస్క్. పక్షికి స్వేచ్ఛ లభించింది అంటూ మాత్రమే కోట్ చేశాడు.
Also Read : సిఇఓ పరాగ్ అగర్వాల్ పై మస్క్ వేటు