I Phone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో.. రోలెక్స్ వాచ్ అదుర్స్
కళ్లు చెదిరే డిజైన్ తో పాపులర్
I Phone 14 Pro Max : ఆపిల్ కంపెనీ ఏది చేసినా ఓ సంచలనమే. తాజాగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 ప్రో ఎడిషన్ గురించి లీకు ఇచ్చింది. ఫోన్ తో పాటు ఈసారి దీని ప్రత్యేకత ఏమిటంటే ఐ ఫోన్ వెనుక గోల్డ్ రోలెక్స్ డేటోనా వాచ్ కూడా ఉండడం. 1టిబి స్టోరేజ్ తో ఐఫోన్ 14ని పొందు పర్చింది కంపెనీ.
ఐఫోన్ ప్రో మాక్స్ టాప్ ధర ప్రస్తుతం రూ. 1,89,900గా ఉంది. ఇది చాలా ఖరీదైనది. రోలెక్స్ వాచ్ తో కూడిన పరిమిత వెర్షన్ ఐఫోన్ ధర $134250గా ఉంది. లగ్జరీ డిజైనర్ స్టఫ్ తో తయారు చేశారు. డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐఫోన్ 14 ప్రోపై(I Phone 14 Pro Max) భారీ అంచనాలు ఉన్నాయి.
దీనిని గ్రాండ్ కాంప్లికేషన్స్ అని పిలుస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొత్త 2022 ఫ్లాగ్ షిప్ లో రేస్ కార్ కంట్రోల్ ప్యానెల్ అలంకార సెన్సార్ లతో పాటు ఫోన్ బాడీలో రోలెక్స్ వాచ్ పొందు పరిచారు. గ్రాండ్ కాంప్లికేషన్ అప్ డేట్ లో రెండు ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. డెటోనా , స్కెలిటన్ బూస్టర్ గా ఉంది.
ఈ రెండు వేరియంట్లలో ఒక దానికి ఫ్లోరిడా లోని డేటోనా బీచ్ పేరు పెట్టారు. ఇది ఆటో రేసింగ్ లో అతి పెద్ద పేర్లకు నిలయంగా ఉంది. రేసింగ్ కమ్యూనిటీలో గడియారాలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఐఫోన్ 14 ప్రో గ్రాండ్ కాంప్లికేషన్స్ 128జీబీ స్కెలిటన్ బూస్టర్ కోసం మోడల్ ల ధర $10,320 నుండి ప్రారంభం కానుంది.
రోలెక్స్ తో మార్పులు చేయడం దీనికి అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు.
Also Read : భారత మహిళా శక్తి అద్భుతం – మహీంద్రా