Supreme Court : హైకోర్టు భిన్న స్వ‌రం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంపై విచార‌ణ

Supreme Court : దేశ వ్యాప్తంగా క‌ల‌కం రేపింది హైద‌రాబాద్ లోని మోయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం. త‌మ‌ను కావాల‌ని ఇరికించారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ముగ్గురు సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించారు. త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని , త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరారు.

శుక్ర‌వారం ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం జ‌స్టిస్ గ‌వాయి, జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న‌ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక కేసుకు సంబంధించి భిన్న స్వ‌రాలు ఎలా వినిపిస్తారంటూ హైకోర్టుపై కామెంట్స్ చేసింది.

కేసులో మెరిట్ ఆధారంగా విచార‌ణ జ‌ర‌పాల‌ని ట్ర‌య‌ల్ కోర్టుకు సూచ‌న‌లు చేసింది ధ‌ర్మాస‌నం. ఈ కేసుకు సంబంధించి న‌వంబ‌ర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదే స‌మ‌యంలో బెయిల్ పిటిష‌న్ వేసి ఉంటే ఇవాళే విడుద‌ల చేసే వాళ్ల‌మ‌ని పేర్కొంది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో నిందితులుగా ఉన్న ముగ్గురు నిందితుల త‌ర‌పు లాయ‌ర్ త‌మ వాద‌నలు వినిపించారు.

రాష్ట్ర పోలీసులు క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు. మెజిస్ట్రేట్ నిందితుల‌కు రిమాండ్ తిర‌స్క‌రించార‌ని , కానీ రెండు రోజుల్లోనే హైకోర్టులో తీర్పు మారింద‌ని గుర్తు చేశారు. దీనిపై సుప్రీం ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఒక కేసుకు సంబంధించి భిన్న స్వ‌రాలు ఎలా వినిపిస్తారంటూ హైకోర్టును ప్ర‌శ్నించింది.

సోమ‌వారం జ‌రిగే విచార‌ణ‌లో ఎలాంటి తీర్పు వెలువ‌రించ బోతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : 7న రాహుల్ బహిరంగ స‌భ – రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!