IND vs PAK T20 World Cup : దాయాదులు మ‌ళ్లీ త‌ల‌ప‌డ‌తారా

ఆఖ‌రి అంకానికి చేరుకున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్

IND vs PAK T20 World Cup : కేవ‌లం రెండు అడుగుల దూరంలో ఉంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి వ‌ర‌ల్డ్ క‌ప్ -2022. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అంతా అనుకున్న‌ట్టుగానే భార‌త‌, పాకిస్తాన్ జ‌ట్లు సెమీ ఫైన‌ల్ లోకి అడుగు పెట్టాయి.

విచిత్రం ఏమిటంటే ఈ రెండు జ‌ట్లు ఒకే గ్రూప్ -బిలో ఉన్నాయి. ప్ర‌స్తుతం గ్రూప్ -ఎ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జ‌ట్లు చేరుకున్నాయి. ఇక గ్రూప్ -బి నుంచి చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు పాకిస్తాన్ , భార‌త్ జ‌ట్లు(IND vs PAK T20 World Cup) ఉన్నాయి. యావ‌త్ ప్ర‌పంచ‌మంతా ఊపిరి బిగ‌ప‌ట్టి చూస్తోంది.

ఈ రెండు జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డాల‌ని, ఫైన‌ల్లో ఆడాల‌ని కోరుకుంటున్నాయి. యావ‌త్ క్రికెట్ లోక‌మే కాదు క్రికెట్ ను వ్యాపారంగా మార్చేసిన బ‌డా కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు, బిజినెస్ టైకూన్లు కోరుకుంటున్నారు కూడా. ఇక మెగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించింది భార‌త జ‌ట్టు.

ప్ర‌ధానంగా విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడిన ఇన్నింగ్స్ తో పాటు హార్దిక్ పాండ్యా అద్భుత‌మైన ఆట తీరు టీమిండియాను గెలిచేలా చేసింది. ఈ త‌రుణంలో  ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాకిస్తాన్ ఓట‌మి పాలై అనంత‌రం తిరిగి సెమీస్ కు చేరుకుంది.ఈ మొత్తం నాలుగు జ‌ట్ల‌లో ఇంగ్లండ్, కీవీస్ , భార‌త్ మ్యాచ్ ల ప‌రంగా సెమీస్ కు చేరుకున్నాయి.

కానీ పాకిస్తాన్ మాత్రం ల‌క్ తో బ‌య‌ట ప‌డింది. సెమీస్ కు చేరింది. నెద‌ర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా అప‌జ‌యం పాల‌వ‌డంతో అనుకోని రీతిలో అదృష్టం వ‌రించి ర‌న్ రేట్ ఆధారంగా పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సెమీ ఫైన‌ల్లో గ్రూప్ -1లో టాప్ లో ఉన్న కీవీస్ గ్రూప్ -2లో టాప్ 2లో ఉన్న పాకిస్తాన్ తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇక గ్రూప్ -1 టాప్ లో ఉన్న భార‌త్ గ్రూప్ -2లో 2లో ఉన్న ఇంగ్లండ్ తో పోటీ ప‌డుతుంది. ఎవ‌రు గెలిస్తే వాళ్లు ఫైన‌ల్ కు వెళతారు. ఈసారి భారీ ప్రైజ్ ఎవ‌రికి ద‌క్కుతుందో వేచి చూడాలి.

Also Read : భార‌త్ భ‌ళా జింబాబ్వే విల‌విల‌

Leave A Reply

Your Email Id will not be published!