Celebrities Good Bye : ట్విట్టర్ కు ప్రముఖులు గుడ్ బై
అంబర్ హర్డ్ నుంచి మోడల్ జిగి హడిద్
Celebrities Good Bye : టెస్లా సిఇఓ, చైర్మన్ ట్విట్టర్ ను భారీ కొనుగోలు చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రూ. 4,400 కోట్లకు కైవసం చేసుకున్నాడు మస్క్ మైక్రో బ్లాగింగ్ సంస్థను. కాగా పలువురు టాప్ లో ఉన్న వారందరినీ తొలగించాడు. సగానికి పైగా రావద్దని ఇమెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
తాజాగా మనసు మార్చుకున్నా అంతగా ఫలితం కనిపించడం లేదు. మరో వైపు ట్విట్టర్ లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు, హాలీవుడ్ ప్రముఖ నటి అంబర్ హర్డ్ ఇటీవలే ట్విట్టర్ కు గుడ్ బై చెప్పింది. తాను వీడుతున్నట్లు తెలిపింది.
ఇది ఒకరకంగా మస్క్ కు షాక్ ఇచ్చినట్టే. తాజాగా అంబర్ హర్డ్ తో పాటు మరికొందరు సెలిబ్రిటీలు వీడడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు బ్లూ టిక్ మార్క్ కావాలని అనుకుంటే ప్రతి నెలా $8 డాలర్లు రుసుము కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ట్విట్టర్.
దీంతో చాలా మంది ప్రముఖులు దానిని వీడేందుకు(Celebrities Good Bye) మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ టెలివిజ్ హోస్ట్ హోపి గోల్డ్ బెర్గ్ ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ ప్రస్తుతం గజిబిజిగా మారిందని ఆరోపించింది. ఇక అంబర్ హర్డ్ అయితే 2016 నుంచి 2017 దాకా ఒక ఏడాది పాటు మస్క్ తో డేటింగ్ చేసింది.
ఇక ప్రముఖ మోడల్ జిగి హడిద్ కూడా గుడ్ బై చెప్పేసింది ట్విట్టర్ కు. ద్వేషం, మూర్ఖత్వానికి పరాకాష్టగా మారిందంటూ ఆరోపించింది. సింగర్ టోనీ బ్రాక్స్టన్ సైతం తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రముఖ స్క్రీన్ రైటర్ , నిర్మాత షోండా రైమ్స్ కూడా తాను కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు.
Also Read : ఆ దర్శకుడి మాటలే నాకు ఓదార్పు