Sajjala Ramakrishna Reddy : శ‌ర‌త్ విజ‌య సాయి అల్లుడు కాదు

ప్ర‌శ్నించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి

Sajjala Ramakrishna Reddy : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ అర‌బిందో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డితో పాటు మ‌రో వ్యాపార‌వేత్త విన‌య్ బాబును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ అరెస్ట్ చేసింది. దీంతో అటు ఏపీలో ఇటు తెలంగాణ‌లో బ‌డా వ్యాపార‌వేత్త‌లలో గుబులు రేగుతోంది.

ఈ త‌రుణంలో అరెస్ట్ అయిన శ‌ర‌త్ చంద్రా రెడ్డి వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి అల్లుడు అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి. విజ‌య సాయి రెడ్డికి ఒకే ఒక్క కూతురు ఉంద‌న్నారు. అరెస్ట్ అయ్యింది ఆయ‌న అల్లుడు కాద‌న్నారు.

ఆయ‌న అల్లుడి సోదరుడంటూ స్ప‌ష్టం చేశారు సజ్జ‌ల‌. అరబిందో ఫార్మా చిన్న కంపెనీ కాద‌న్నారు. ఆ సంస్థ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో ఎంతో పేరుంద‌న్నారు. వేల కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ ఉందంటూ కితాబు ఇచ్చారు. ఈ త‌రుణంలో విజ‌య సాయి రెడ్డికి శ‌ర‌త్ చంద్రా రెడ్డికి ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు.

ఆపై ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని కూడా లాగుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్త‌ల‌ను ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. గురువారం స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) మీడియాతో మాట్లాడారు. వాస్త‌వాలు తెలుసుకుని ప్ర‌చారం చేయాల‌ని ఏది ప‌డితే అది వాడొద్దంటూ హిత‌వు ప‌లికారు.

లిక్క‌ర్ స్కాంలో కేంద్రం, తెలంగాణ స‌ర్కార్ మ‌ధ్య వార్ కొన‌సాగుతోంద‌న్నారు. మ‌ధ్య‌లో వైసీపీకి, విజ‌య సాయి రెడ్డికి, జ‌గ‌న్ రెడ్డికి ఏంటి సంబంధంటూ మ‌రోసారి ప్ర‌శ్నించారు.

Also Read : ఎవ‌రీ శ‌ర‌త్ చంద్రా రెడ్డి ఏమిటా క‌థ

Leave A Reply

Your Email Id will not be published!