Elon Musk Announces : ట్విట్టర్ బ్లూ టిక్ పై మస్క్ క్లారిటీ
భారీ ఫేక్ ఖాతాల గుర్తింపు
Elon Musk Announces : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా టాప్ ఎగ్జిక్యూటివ్ లను సాగనంపాడు. ఆపై సగానికి పైగా ఉద్యోగులను తీసి వేశాడు. మరో వైపు వారంలో 80 గంటలు పని చేయాలని ఆదేశించాడు.
ఇక నుంచి ఉచితంగా లంచ్ , డిన్నర్ అంటూ ఉండదని పేర్కొన్నాడు. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు ఎలాన్ మస్క్. ఇదే సమయంలో బ్లూ టిక్ గతంలో ఉచితంగా ఇచ్చే వారు యూజర్లకు. కానీ కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ఇది ట్విట్టర్ పరంగా అధికారికంగా గుర్తింపు. ఈ తరుణంలో ఇక నుంచి ఉచితం అంటూ ఏదీ ఉండదని స్పష్టం చేశాడు. బ్లూ టిక్ కావాలంటే ప్రతి నెలా $8 డాలర్లు చెల్లించాలని ఆదేశించాడు.
ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్ మస్క్ తరపున ట్విట్టర్ ప్రకటించింది. దీని దెబ్బకు వేలాది మంది ట్విట్టర్ యూజర్లు లబోదిబోమంటున్నారు. సంస్థలో సంస్థాగతంగా, టెక్నికల్ పరంగా కీలకమైన మార్పులు చేయాలని ఆదేశించాడు మస్క్(Elon Musk Announces).
ఆయనకు అన్నింట్లోనూ చేదోడుగా ఉంటూ వచ్చారు తమిళనాడుకు చెందిన టెక్ నిపుణుడు శ్రీరామ్ శ్రీధరన్. మనోడి సలహాలు, సూచనలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా తాజాగా మరో కీలక ప్రకటన చేశారు ట్విట్టర్ బాస్. బ్లూ టిక్ కు సంబంధించి కొత్త రూల్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది ట్విట్టర్.
Also Read : ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్