Cong Campaigners : స్టార్ క్యాంపెయిన‌ర్లుగా గెహ్లాట్..సోనియా

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌ట‌న

Cong Campaigners : గుజ‌రాత్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. ఇక ఆప్ త‌మ సీఎం అభ్య‌ర్థిని డిక్లేర్ చేసింది. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టో ను విడుద‌ల చేసింది. ఇదిలా ఉండ‌గా పార్టీ త‌ర‌పున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో పాటు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ల‌ను ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా పార్టీ త‌ర‌పున రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో పాల్గొన‌లేదు.

ఇక కాంగ్రెస్ పార్టీ త‌న స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో(Cong Campaigners) 40 మంది పేర్ల‌ను ప్ర‌క‌టించింది. గెహ్లాట్, సోనియా గాంధీ తో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , పార్టీకి చెందిన రాహుల్ గాంధీ కూడా పాల్గొంటార‌ని పార్టీ ప్ర‌క‌టించింది. కాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్వంత రాష్ట్రం గుజ‌రాత్. ఇక్క‌డ బీజేపీ 27 ఏళ్లుగా కంటిన్యూగా పాలిస్తోంది.

మ‌రోసారి ప‌వర్ లోకి రావాల‌ని కోరుకుంటోంది. ఇప్ప‌టికే విజ‌యం సాధించే బాధ్య‌త‌ను త‌న భుజాన మీద వేసుకున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎంలు అశోక్ గెహ్లాట్ , భూపేష్ బ‌ఘేల్ కూడా ఉన్నారని పార్టీ ప్ర‌క‌టించింది.

ప్రియాంక గాంధీ వాద్రా, కేర‌ళ సీఎల్పీ నాయ‌కుడు ర‌మేష్ చెన్నితాల‌, మాజీ సీఎంలు దిగ్విజ‌య్ సింగ్ , క‌మ‌ల్ నాథ్ , భూపింద‌ర్ సింగ్ హూడా, అశోక్ చ‌వాన్ ఉన్నారు.

Also Read : పౌర స‌మాజం మేల్కోక పోతే ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!