Shashi Tharoor : ఫిరాయింపుదారులు ‘ఊస‌ర‌వెల్లులు’

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన శ‌శి థ‌రూర్

Shashi Tharoor : ఈ దేశంలో కొంద‌రు నాయ‌కులు ఏది మాట్లాడినా క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారి పోతుంది. ప్ర‌చారంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మేఘాల‌య మంత్రి టెమ్ జెన్ , కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు టాప్ లో ఉంటే ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఎంపీ శ‌శి థ‌రూర్ మాత్రం మోస్ట్ పాపులర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు.

ఆయ‌నకు ఇంగ్లీష్ బాష‌పై మంచి ప‌ట్టుంది. స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌, వ‌క్త‌, విశ్లేష‌కుడు, అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగి ఉండ‌డంతో థ‌రూర్ రాసే రాత‌లు, మాట్లాడే మాటలు, చేసే ట్వీట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆయ‌న మాట్లాడుతుంటే మీడియా సైతం ఎక్కువ‌గా ప్ర‌భావానికి గుర‌వుతుంది.

కార‌ణం ఏమిటంటే కొత్త‌గా ఇంగ్లీష్ ప‌దాలు వాడ‌తారు. చాలా మంది మీడియా టైకూన్లు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సైతం ఆస‌క్తిగా వింటారు. వాటిని వాడేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. శుక్ర‌వారం శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజ‌రాత్ రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు జంప్ అవుతున్నారు. ఎవ‌రు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావ‌డం లేదు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు పార్టీలు మారుతున్న వారిపై. విలువ‌ల‌ను వ‌దిలి వేసి నిస్సిగ్గుగా ప‌ద‌వుల కోసం ఇత‌ర పార్టీలు మారుతున్న వారంద‌రినీ ఆయ‌న ఊస‌ర‌వెల్లులతో పోల్చారు.

ఇలాంటి వారి వ‌ల్ల పార్టీలు చుల‌క‌న అవుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలా పార్టీలు మారుస్తూ పోతే వారికి విలువ ఏం ఉంటుందంటూ ప్ర‌శ్నించారు శ‌శి థ‌రూర్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : 15 రోజులు సూర్యోదయాన్ని చూడ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!