Assam CM : మోదీ లేక పోతే అప్తాబ్ లు పుట్టుకొస్తారు

అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ

Assam CM : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో బ‌ల‌మైన ప్ర‌ధాన‌మంత్రి లేక పోతే ఢిల్లీలో శ్ర‌ద్ధా వాక‌ర్ ను దారుణంగా హ‌త్య చేసిన అప్తాబ్ పూనావాలా లాంటి వాళ్లు ప్ర‌తి చోటా పుట్టుకు వ‌స్తార‌ని హెచ్చ‌రించారు. ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేంద్ర మోదీ త‌ప్ప బ‌ల‌మైన నాయ‌కులు ప్ర‌ధానులుగా రాలేద‌న్నారు.

ఆ ఘ‌న‌త ఒక్క మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. రాబోయే ఎన్నికల్లో మ‌రోసారి బీజేపీకి ప‌ట్టం కట్టాల‌ని సీఎం(Assam CM) పిలుపునిచ్చారు. మోదీ కొలువు తీరాక దేశంలో నేరాల సంఖ్య త‌గ్గింద‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారికి సింహ‌స్వ‌ప్నంగా మారార‌ని చెప్పారు హిమంత బిస్వ శ‌ర్మ‌. మూడోసారి మోదీని ప్ర‌ధాన‌మంత్రిగా చేయాల్సిన బాధ్య‌త 137 కోట్ల ప్ర‌జ‌ల‌పై ఉంద‌న్నారు.

హిందూ మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారంటూ సీఎం ఆరోపించారు. అప్దాబ్ ముంబై నుంచి శ్ర‌ద్దా వాక‌ర్ ను తీసుకొచ్చి ల‌వ్ జిహాద్ పేరుతో 35 ముక్క‌లుగా చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఫ్రిజ్ లో మృత దేహాన్ని ఉంచి మ‌రో మ‌హిళ‌తో డేటింగ్ ప్రారంభించాడంటూ మండిప‌డ్డారు.

దేశానికి శ‌క్త‌వంత‌మైన నాయ‌కుడు లేక పోతే అప్తాబ్ పూనావాలా లాంటి వాళ్లు ప్ర‌తి చోటా మ‌ళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటారని హెచ్చ‌రించారు హిమంత బిస్వా శ‌ర్మ‌. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరిగి కాషాయానికి ప‌ట్టం క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండ‌గా దారుణంగా హ‌త్య చేసిన అప్తాబ్ అమీన్ పూనావాలాను ఉరి తీయాలంటూ న్యాయ‌వాదులు ఆందోళ‌న చేప‌ట్టారు.

Also Read : బీజేపీలో నీతిమంతులు ఎవ‌రో చెప్పండి

Leave A Reply

Your Email Id will not be published!