Satyendar Jain Massage : తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ జోష్
సిబ్బంది సహకారం మసాజ్ తో సంతోషం
Satyendar Jain Massage : మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఉన్నారు. దీంతో ఆయనను తొలగించాలంటూ బారతీయ జనతా పార్టీ డిమాడ్ చేసింది. బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కోర్టు ఒప్పుకోలేదు జైన్ కు బెయిల్ ఇచ్చేందుకు. మనోడు చెరసాలలో ఫుల్ ఎంజాయ్ చేస్తుండడం కలకలం రేపింది.
రాచ మర్యాదలతో ఉండడం , అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వీడియో కూడా బయటకు వచ్చింది. మంత్రి సత్యేంద్ర జైన్ కు కొందరు మసాజ్(Satyendar Jain Massage) చేయడం క్లియర్ గా కనిపించింది. ఆయన మంచంపై ఉండగా బాడీ, ఫుట్ , బ్యాక్ మసాజ్ (మర్దన) చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
సత్యేంద్ర జైన్ కూర్చుంటే తలపై కూడా మర్దన చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా గతంలో మంత్రికి సమకూరుస్తున్న సౌకర్యాల గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆధారాలను కోర్టుకు సమర్పించింది. సమయం దాటినా రూల్స్ కు విరుద్దంగా ఆహారం అందజేస్తున్నారంటూ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వెల్లడించారు.
సత్యేంద్ర జైన్ జైలు జీవితానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ లను కూడా కోర్టుకు సమర్పించారరు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట అజిత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సిబ్బందిపై వేటు వేశారు. ఇందుకు సంబంధించి ఎలా సమర్థిస్తారంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కాషాయ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. నీతులు చెబుతూ గోతులు తవ్వడం ఒక్క ఆప్ కే చెల్లిందంటున్నారు.
Also Read : మోదీ లేక పోతే అప్తాబ్ లు పుట్టుకొస్తారు