Gopal Roy : ఆప్ దే ఢిల్లీ బ‌ల్దియా – గోపాల్ రాయ్

బీజేపీ కుట్ర‌లు..కుతంత్రాలు సాగ‌వు

Gopal Roy : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా లేదా ఎంత‌టి దుష్ప్రచారం చేసినా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి గోపాల్ రాయ్(Gopal Roy). మంగ‌ళ‌వారం ఢిల్లీ మ‌హాన‌గ‌ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. బీజేపీ కావాల‌నే జైలులో ఉన్న మంత్రి స‌త్యేంద్ర జైన్ వీడియోను వైర‌ల్ చేస్తోంద‌ని ఆరోపించారు.

ఇప్ప‌టికే కోర్టు అలా వీడియో బ‌య‌ట‌కు రావ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింద‌ని చెప్పారు. ఇక బీజేపీ ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా కుతంత్రాల‌కు దిగినా ఆట‌లు సాగ‌వ‌న్నారు.

ప్ర‌జ‌లు మాయ మాట‌లు చెప్పే కేంద్రం సొల్లు క‌బుర్లు న‌మ్మ‌ర‌న్నారు. ప‌ని చేసే వారికి ప‌ట్టం క‌ట్టడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇప్ప‌టికే త‌మ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కూడా చేరార‌ని తెలిపారు. వీడియోల‌ను ప‌దే ప‌దే స‌ర్కులేట్ లేదా షేర్ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌ద‌న్నారు.

బీజేపీ దిగ‌జారుడు రాజ‌కీయాలకు పాల్ప‌డుతోందంటూ గోపాల్ రాయ్(Gopal Roy) మండిప‌డ్డారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా స్కూళ్ల‌ను తీర్చిదిద్దిన ఘ‌న‌త ఢిల్లీలోని ఆప్ స‌ర్కార్ కు ద‌క్కుతుంద‌న్నారు. త‌మ ఎజెండా ఒక్క‌టేన‌ని అది పేద‌లకు ఉన్న ఇబ్బందుల‌ను తొల‌గించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

అన‌వ‌స‌ర రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌భుత్వాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న కేంద్రానికి, బీజేపీకి దాని అనుబంధ సంస్థ‌ల‌కు ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. మొత్తంగా ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఢిల్లీ బ‌ల్దియా ఎన్నిక‌ల్లో ఆప్ జెండా ఎగ‌ర‌డం చూస్తార‌ని అన్నారు గోపాల్ రాయ్.

Also Read : రాహుల్ యాత్ర‌లో చేర‌నున్న ప్రియాంక

Leave A Reply

Your Email Id will not be published!