Ramdev Baba Row : మ‌హిళ‌లు దుస్తులు లేకున్నా బాగుంటారు

రాందేవ్ బాబా కామెంట్స్ దుమారం

Ramdev Baba Row : ఈ మ‌ధ్య‌న స్వాములు, బాబాలు ఎక్కువై పోయారు. బీజేపీ ప్ర‌భుత్వం కేంద్రంలో కొలువు తీరాక వీరికి ప్ర‌యారిటీ పెరిగింది. అంతే కాదు వారి మాట‌ల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్ర‌ధాని మోదీతో స‌న్నిహితంగా ఉండే ప‌తంజ‌లి గురు రాందేవ్ బాబా మ‌హిళ‌ల ప‌ట్ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విచిత్రం ఏమిటంటే ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్ ముందు చేయ‌డం విస్తు పోయేలా చేసింది. మ‌హిళ‌లు చీర‌లో అందంగా క‌నిపిస్తారు. స‌ల్వార్ షూట్ ల‌లో కూడా బాగుంటారు.

నాలాగే మీరు ఏది వేసుకున్నా స‌రే గ‌తంలో ప‌దేళ్ల వ‌ర‌కు బ‌ట్ట‌లు వేసుకోలేదంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు. మ‌హారాష్ట్ర లోని థానే లో యోగి శిబిరం చేప‌ట్టారు. ఇది ముగిసే స‌మ‌యానికి మ‌హిళ‌లు చీర‌లు క‌ట్టుకునేందుకు స‌మ‌యం లేక పోయింది.

దీంతో విష‌యం తెలుసుకున్న రాం దేవ్ బాబా(Ramdev Baba Row) ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా ప‌తంజలి యోగా పీఠం, ముంబై ప‌తంజ‌లి యోగా స‌మితి సంయుక్తంగా యోగా సైన్స్ క్యాంపును నిర్వ‌హించాయి.

ఈ సంద‌ర్బంగా వేష‌ధార‌ణ గురించి ప్ర‌స్తావించారు రాం దేవ్ బాబా. మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాందేవ్ బాబాను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి మ‌హిళా సంఘాలు.

Also Read : ఆరోగ్యంగా ఉన్నా ఆందోళ‌న వ‌ద్దు – ఉపేంద్ర

Leave A Reply

Your Email Id will not be published!