Anurag Thakur : ఆప్ అబద్దాల పార్టీ – అనురాగ్ ఠాకూర్
సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సెటైర్
Anurag Thakur : కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీపై నిప్పులు చెరిగారు. అబద్దాలకు కేరాఫ్ ఆ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ మహానగర ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా ఆప్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఢిల్లీ మద్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది.
మరో వైపు ఎలాగైనా సరే ఢిల్లీ బల్దియాపై కాషాయ జెండా ఎగుర వేయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. అభివృద్ది, సుస్థిరత, విద్య, వైద్యం, ఉపాధి పేరుతో ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) సీఎంపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసం చేయడంలో సీఎం ఆరి తేరాడంటూ ఫైర్ అయ్యారు. నీతులు వల్లించడంలో అరవింద్ కేజ్రీవాల్ అందరినీ మించి పోయాడని ఆరోపించారు. ఈ సారి బల్దియా ఎన్నికల్లో బీజేపీకి ఊహించని రీతిలో ఆదరణ లబిస్తోందని చెప్పారు.
అత్యధిక సీట్లు గెలుచుకుంటామని జోష్యం చెప్పారు. ఆప్ ను ఢిల్లీ ప్రజలు నమ్మడం లేదన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ ఆప్ అని మండిపడ్డారు. ఓ మంత్రి జైలులో ఎంజాయ్ చేస్తున్నారని, మరో విద్యా శాఖ మంత్రి వైద్యం స్కాంలో ఇరుక్కున్నారని ఇది ఆప్ చరిత్ర అంటూ ఫైర్ అయ్యారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
Also Read : దాడులు సరే అరెస్ట్ ల మాటేమిటి