Suriya Quits Vanangaan : అయ్యో ‘బాల’ ‘సూర్య’ ఎందుకిలా
వనంగాన్ నుంచి హీరో అవుట్
Suriya Quits Vanangaan : తమిళ సినీ చరిత్రలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా పేరొందాడు బాల. ఆయన తీసే చిత్రాలు డిఫరెంట్ గా ఉంటాయి. సామాజిక నేపథ్యం, ప్రధాన సమస్యలను ఎత్తి చూపేందుకు బాగా ట్రై చేస్తాడు. తాజాగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ నటుడు సూర్యతో కలిసి వనంగాన్ సినిమాను ప్రారంభించాడు.
షూటింగ్ కూడా జరుగుతోంది కూడా. చాలా కాలం తర్వాత బాల, సూర్య కలిసి సినిమా చేస్తుండడంతో భారీ ఎత్తున అంచనాలు కూడా పెరిగాయి. కానీ ఎందుకో ఏమైందో ఏమో కానీ తాను వనంగాన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు నటుడు సూర్య(Suriya Quits Vanangaan).
ఈ ఒక్క ప్రకటన తమిళ సినీ రంగంలో కలకలం రేపింది. ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్న ప్రచారం కూడా జోరందుకుంది. పెద్ద ఎత్తున కథనాలు కూడా వెలువడ్డాయి. వనంగాన్ కు సంబంధించి భారీగా పూజలు చేశారు. అంతలోపే ఏమైందంటూ అనుమానాలు, ఊహాగానాలు పెరిగాయి.
సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే సూర్య సైలంట్ గా తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో స్వతహాగా దర్శకుడు బాల స్పందించాడు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తనకు సూర్యకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, తామిద్దరం అన్నా, తమ్మళ్లమని పేర్కొన్నాడు బాల. అయితే వనంగాన్ కు సంబంధించి కొంత స్క్రిప్టులో మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
దీని వల్ల ఇందులో కథకు తగ్గట్టు సూర్యకు సరిపోదని పాత్ర. అందుకే తాను చెప్పడం వల్లనే సూర్య సినిమా నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశాడు బాల. నా తమ్ముడితో కలిసి వనంగాన్ సినిమా తెరకెక్కించాలని అనుకున్నా. కానీ నేనే వద్దన్నా.
Also Read : ‘జక్కన్న’కు అరుదైన పురస్కారం