Shankar Singh Vaghela : మోదీ నమ్మదగిన నాయకుడు కాదు
ఆయనో చావుల వ్యాపారి అంటూ ఫైర్
Shankar Singh Vaghela : గుజరాత్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ కాసేపటికే సంచలన ఆరోపణలు గుప్పించారు ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా(Shankar Singh Vaghela). సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీకి సంబంధించి కనిపించే ముఖం వేరని పేర్కొన్నారు.
మోదీని ఓ చావుల వ్యాపారి అంటూ ఆరోపించారు. గోద్రా ఘటనకు ఆయనే కారణం అన్నట్టుగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవలే సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే సమయంలో గోద్రా ఘటన జరిగిన సమయంలో బిల్కిస్ బానోను సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఘటన కలకలం రేపింది.
ఈ సంఘటనలో జీవిత ఖైదు విధించిన వారందరినీ తిరిగి కేంద్ర సర్కార్ మద్దతుతో గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీనిని సవాల్ చేస్తూ బాధితురాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి మాజీ సీఎం వాఘేలా మోదీని టార్గెట్ చేశారు.
ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గోద్రాలో అంత్యక్రియల ఊరేగింపు చేయబోతున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీని రావణాసురుడితో పోల్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ. కాగా దీనిని పాజిటివ్ గా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
ఈసారి గుజరాత్ లో కాషాయం ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు శంకర్ సింఘ్ వాఘేలా.
Also Read : గోవాలో ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి సిద్దం