Rahul Gandhi Kiss Viral : రాహుల్ హ‌ల్ చ‌ల్ ‘కిస్’ వైర‌ల్

పాదయాత్ర‌లో బీజేపీ నేత‌ల‌కు ముద్దులు

Rahul Gandhi Kiss Viral : దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో పూర్త‌యింది యాత్ర‌.

ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. రాహుల్ యాత్ర‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్రభుత్వం కొన‌సాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు స‌చిన్ పైల‌ట్ , త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు రాహుల్ గాంధీ వెంట న‌డుస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా యాత్ర సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది.ఝాల‌వ‌ర్ లోని న‌హ‌ర్డిలో పాద‌యాత్ర కొన‌సాగుతుండ‌గా అక్క‌డ బీజేపీ పార్టీ కార్యాల‌యం భ‌వ‌నంపై నిలిచి ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Kiss Viral).

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం తెలిపింది బీజేపీ. ఇది కావాల‌ని చేయ‌లేద‌ని పాద‌యాత్ర జోష్ లో క్యాడ‌ర్ ను ఉత్సాహ ప‌రిచేందుకు రాహుల్ గాంధీ అలా చేశారంటూ క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

మొత్తంగా ఇప్పుడు నెట్టింట్లో ఎక్క‌డ చూసినా రాహుల్ వైర‌ల్ గా మారి పోయారు. మోదీని జాదూగ‌ర్ పేరుతో ఉన్న పాట‌ను వాడ‌డం కూడా ఇబ్బంది క‌లిగించేలా చేసింది. కాగా రాహుల్ గాంధీని చూసేందుకు బీజేపికి చెందిన వారు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉన్నార‌ని కాంగ్రెస్ తెలిపింది.

Also Read : ఎగ్జిట్ పోల్స్ బ‌క్వాస్ – సీఎం కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!