Kodali Nani Jr NTR : లోకేశ్ కు అంద‌లం ఎన్టీఆర్ కు మంగ‌ళం

మాజీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

Kodali Nani Jr NTR : ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పై మండిప‌డ్డారు. త‌న కొడుకు లోకేశ్ కు ఎక్క‌డ అడ్డు వ‌స్తాడోన‌ని న‌టుడు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేశాడ‌ని ఆరోపించారు. రాష్ట్రంలో జూనియ‌ర్ ఛాయ‌ల్ లేకుండా చేసేందుకు కుట్ర‌లకు తెర తీశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు కొడాలి నాని(Kodali Nani).

ఇప్ప‌టికే పాతాళానికి తొక్కేస్తున్నారంటూ మండిప‌డ్డారు. లోకేశ్ ను బ‌ల‌వంతంగా జ‌నంలోకి తీసుకు వ‌స్తున్నాడ‌ని పేర్కొన్నారు. బీసీల‌ను ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. జోగి ర‌మేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని అయిన‌ట్టేన‌ని స్ప‌ష్టం చేశారు కొడాలి నాని. ఇవాళ కుట్ర‌ల‌కు తెర‌లేపే చంద్ర‌బాబు నాయుడును ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నాడు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని త‌ట్టుకుని నిల‌బ‌డే శ‌క్తి, సామ‌ర్థ్యాలు టీడీపీ చీఫ్ కు లేద‌న్నారు. ఆయ‌న చేసే కుట్ర‌లు, కుతంత్రాలు ఇక్క‌డ చెల్లుబాటు కావ‌న్నారు కొడాలి నాని. అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డే ధ‌మ్ము, ధైర్యం ఒక్క ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మాత్ర‌మే ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఊహించని స‌న్నివేశం చోటు చేసుకుంది.

శుక్ర‌వారం వంగ‌వీటి రాధాను క‌లుసు కోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారంది. రాధా కోసం కొంత సేపు వేచి ఉండ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా గుడివాడ‌లో ఓ నేత కూతురు పెళ్లి వేడుక‌లో రాధా, కొడాలి నాని క‌లుసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా కొడాలి నాని, వంగవీటి రాధా క‌లిసి మాట్లాడు కోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

Also Read : కొడాలి నాని రాధా ములాఖ‌త్

Leave A Reply

Your Email Id will not be published!