Bandi Sanjay : శని పోయింది పీడ విరగడైంది – బండి
కేసీఆర్ పార్టీపై బీజేపీ చీఫ్ కామెంట్స్
Bandi Sanjay : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణకు పట్టిన శని పోయిందని, పీడ విరగడైందని సంచలన ఆరోపణలు చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటనపై పై విధంగా కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏం ఒరగ బెట్టిండని దేశాన్ని ఏలేటందుకు పోతడని నిప్పులు చెరిగారు. బండి సంజయ్(Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఏర్పాటుతో టీఆర్ఎస క్లోజ్ అయ్యిందన్నారు.
వందలాది మంది బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభ పడిందని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు ఇంత వరకు భర్తీ చేయలేదన్నారు.
కేవలం ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ నోటిఫికేషన్లు వేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలన్నారు బండి సంజయ్(Bandi Sanjay). తండ్రేమో తాగుబోతు, కొడుకేమో డ్రగ్స్ , కూతురేమో లిక్కర్ రాణి..అల్లుడేమో అవినీతికి కేరాఫ్ అంటూ వీళ్లా తెలంగాణను రక్షించేది అంటూ నిలదీశారు. స్కామ్ లకు పాల్పడిన కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు బండి సంజయ్. కేసీఆర్ చెల్లని రూపాయి అని ఆయన నోటికి కూతలు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు.
పాలన చేతకానోడు పార్టీ పెట్టి ఏం చేస్తడు అని ప్రశ్నించారు.
Also Read : బీజేపీ కుట్రలో భాగమే బీఆర్ఎస్ – రేవంత్