Naveen Reddy Mother : కొడుకు బంగారం వైశాలి రెడ్డి మోసం
నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ
Naveen Reddy Mother : తెలంగాణలో డాక్టర్ కోర్సు చదువుతున్న వైశాలి రెడ్డి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. చివరకు బాధితురాలు సేఫ్ గా ఇంటికి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. నవీన్ రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి విజయవాడకు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఇది పూర్తిగా సినిమా ఫక్కీలో కిడ్నాప్ కు పాల్పడ్డారు. ప్రస్తుతం నవీన్ రెడ్డితో పాటు మరో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా విచారణలో నవీన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. తాను వైశాలి రెడ్డిని 2021 ఆగస్టులో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. తనను వాడుకుని వదిలి వేశారని ఆరోపించాడు.
ఇదిలా ఉండగా నవీన్ రెడ్డి చెప్పిన దానిలో వాస్తవం లేదన్నారు, పూర్తిగా సైకోగా మారి పోయాడని దాడికి పాల్పడ్డాడని వైశాలి రెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు పేరెంట్స్ కు సెక్యూరిటీ కల్పించారు పోలీసులు. ఇదిలా ఉండగా కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడిన నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ(Naveen Reddy Mother) సంచలన ఆరోపణలు చేసింది.
తమ కొడుకుతో పరిచయం ఉందని, వేలాది రూపాయలు ఖర్చు పెట్టించారని ఆరోపించింది నారాయణమ్మ. పెళ్లి కూడా చేస్తామని చెప్పారని, తన ఇంటికి వైశాలి రెడ్డి పేరెంట్స్ వచ్చారని, తమ ఇల్లు, పొలాలు కూడా చూసుకున్నారని తెలిపారు. ఇంతలో ఏమైందో తనకు తెలియదని వాపోయింది నారాయణమ్మ.
గత రెండు సంవత్సరాల నుంచి నవీన్ రెడ్డి, వైశాలి రెడ్డి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్నారు. అమ్మాయి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తానని అన్నది. అయితే వేరే వాళ్లతో పెళ్లి చేస్తున్నందుకే ఇలా జరిగిందని, కానీ దాడి చేయడం తప్పేనని వాపోయింది. తన కొడుకుతో పాటు వైశాలి రెడ్డిది కూడా ఇందులో భాగం ఉందన్నారు నారాయణమ్మ.
Also Read : నవీన్ రెడ్డి దారుణం పెళ్లి అబద్దం