Bandi Sanjay : మోదీ సింహం త‌ట్టుకోవ‌డం క‌ష్టం – బండి

ఏపీ, తెలంగాణ సీఎంలు క‌లిసిపోయిండ్రు

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. మోదీ హింహం లాంటోడ‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్నారు. ప్రజా సంగ్రామ యాత్ర‌లో భాగంగా సోమ‌వారం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. త‌ప్పు చేసిన వాళ్లు ఎవ‌రైనా స‌రే తీహార్ జైలుకు వెళ్లాల్సిందేన‌ని అన్నారు.

కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఇంత రాద్దాంతం, ప్ర‌చారం దేని కోసమ‌ని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రోసారి సెంటిమెంట్ ర‌గిల్చేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లిసి కుట్ర‌లు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఒకసారి రాష్ట్రం విభ‌జ‌న జ‌రిగాక ఇక మ‌ళ్లీ క‌ల‌వ‌డం అంటూ ఉండ‌ద‌న్నారు బండి సంజ‌య్. సోయి త‌ప్పి మాట్లాడుతున్న సీఎంకు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. వేముల‌వాడ రాజ‌న్న‌, ధ‌ర్మ‌పురి, బాస‌ర‌, కొండ‌గ‌ట్టు ఆల‌యాల నిధులు ఏమ‌య్యాయో చెప్పాల‌ని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు.

జ‌గ‌న్ రెడ్డి, కేసీఆర్ ఇద్ద‌రూ ఇద్ద‌రేన‌ని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టులు, క‌మీష‌న్లు దోచుకుంటూ మ‌రోసారి తెలంగాణ‌, ఆంధ్రా సెంటిమెంట్ ర‌గిల్చేందుకు య‌త్నిస్తున్నారంటూ బండి సంజ‌య్(Bandi Sanjay) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బ‌తుకు దెరువు కోసం వేలాది మంది కార్మికులు గ‌ల్ఫ్ బాట ప‌ట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారిని ఆదుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

Also Read : రాహుల్ యాత్ర‌లో ‘ప్రియాంక‌..కూతురు’

Leave A Reply

Your Email Id will not be published!