Sushil Kumar Modi : బీహార్ సీఎం పనై పోయింది – మోదీ

ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఫైర్

Sushil Kumar Modi : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. ఆపై నితీశ్ కుమార్ కు పోయే కాలం వ‌చ్చింద‌న్నారు ఎంపీ. బుధ‌వారం సుశీల్ కుమార్ మోదీ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలోని స‌ర‌న్ జిల్లాల‌లో గ‌ల ఛ‌ప్రా ప్రాంతంలో క‌ల్తీ మ‌ద్యం కార‌ణంగా అనేక మంది మ‌ర‌ణించార‌ని బీజేపీ నిప్పులు చెరిగింది. అయితే సంయ‌మ‌నం కోల్పోయిన సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నాయ‌కుల‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏకంగా వారంతా మ‌ద్యం తాగిన మ‌త్తులో అలా మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు సీఎం.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi). ఇవాళ జ‌రిగిన బీహార్ శాస‌న‌స‌భ‌లో పూర్తిగా ప‌ట్టు కోల్పోయారు నితీశ్ కుమార్. బీజేపీ నాయ‌కుల‌కు ప‌నీ పాట లేద‌న్నారు. వాళ్లకు అభివృద్ది క‌నిపించడం లేదన్నారు. అక్క‌డ ఏం జ‌రిగింద‌నే దానిపై ఇప్ప‌టికే ఆరా తీస్తున్నామ‌ని అన్నారు.

అంత‌లోనే నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు త‌న‌పై చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు నితీశ్ కుమార్. వాళ్లు మతి ఉండి మాట్లాడ‌టం లేదంటూ మండిప‌డ్డారు సీఎం. ఇదిలా ఉండ‌గా ఎంపీ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రోజు రోజుకు నితీశ్ కుమార్ సోయి త‌ప్పి మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ర‌చూ ఇటీవ‌ల జ్ఞాప‌క‌శ‌క్తి కోల్పోతున్నాడ‌ని ఎద్దేవా చేశారు సుశీల్ కుమార్ మోదీ.

Also Read : బిల్కిస్ బానో కేసుపై కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!